అతనికి టచ్ లోనే ఉన్న సమంత?
నాగచైతన్యతో వివాహమైన కొంతకాలం అక్కినేని సమంతగా ఉన్న సామ్ విడాకులిచ్చిన తర్వాత మళ్లీ ఒంటరిగా మారిపోయింది. హీరోయిన్ గా ఎంత పేరు వచ్చిందో నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువగా పేరు తెచ్చుకుంది. మయోసైటిస్ సోకడంతో చికిత్స తీసుకునేందుకు ఏడాదిపాటు సినిమాలకు విరామం ప్రకటించింది. తాజాగా అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. చిత్రయూనిట్ దీనిని ధ్రువీకరించాల్సి ఉంది.
ఈనెల ఎనిమిదోతేదీన అక్కినేని అఖిల్ పుట్టినరోజు. అఖిల్ కు జన్మదిన శుభాకాంక్షులు చెబుతూ సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. నాగచైతన్యకు విడాకులిచ్చినప్పటికీ అక్కినేని కుటుంబం మీద గౌరవంతోపాటు అఖిల్ తో కూడా ఎంతో స్నేహంగా ఉంటోందని దీంతో అర్థమైందంటున్నారు అక్కినేని అభిమానులు. విడాకులైన తర్వాత పలు సందర్భాల్లో నాగచైతన్యపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడంతోపాటు విడాకులు తీసుకోవడం అనేది తనను అత్యంత వేదనకు గురిచేసినట్లు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది.

నాగచైతన్యకు విడాకులిచ్చినప్పటికీ అఖిల్ తో సమంతకు మంచి స్నేహ సంబంధాలున్నాయి. విడాకులు తీసుకోకముందు కూడా అఖిల్ కు వివాహం చేయాలని ఎంతో ప్రయత్నించింది. అఖిల్ కు తన స్నేహితురాలితోనే ఎంగేజ్ మెంట్ జరిగినప్పటికీ అది పెళ్లివరకు వెళ్లలేదు. అఖిల్ కు వివాహం చేయడంతోపాటు నాగచైతన్యకు రెండో పెళ్లి చేయాలనే ప్రయత్నాల్లో నాగార్జున ఉన్నారు. అయితే కెరీర్ పైనే దృష్టి అని, పెళ్లి సంగతేమీ లేదంటూ నాగచైతన్య చెబుతుండటంతో ఎలాగైనా పట్టుబట్టి పెళ్లి చేయాలనే యోచనలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications