సెలెంట్ గా మంట పెట్టిన సమంత?
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత ఏది మాట్లాడిన సంచలనమే అవుతుంది. ప్రధానంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మాట్లాడే ప్రతి మాట వైరల్ అవుతోంది. సమంత ఎక్కడుంది? ఎక్కడికి వెళ్లింది? ఆమె స్నేహితులు ఎవరు? ఏ సినిమాలు చేస్తోంది? లాంటి విషయాలను తెలుసుకోవడానికే నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాదు.. ఆమె ఎక్కడకు వెళుతుంది? ఎవరిని కలుస్తుంది? సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ లు పెడుతోంది అన్న విషయాలపైనే దృష్టిసారిస్తున్నారు.
ది మార్వెల్స్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడింది. రిపోర్టర్ లు ఆమెను పలు విధాలుగా ప్రశ్నించారు . ఓ రిపోర్టర్ సమంతను ప్రశ్నిస్తూ..తెలుగులో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగ ఒక సూపర్ హీరో సిరీస్ నిర్మిస్తే మీరు సూపర్ హీరోలుగా ఎవరిని ఎంచుకుంటారు? అని ప్రశ్నించారు . దీనికి సమంత కూడా నేరుగా సమాధానం ఇచ్చింది.

తనకు అల్లు అర్జున్ అంటే ఎంతో పిచ్చి అని, అతనే తన సూపర్ హీరో అని చెప్పింది. అంతేకాదు.. విజయ్ దేవరకొండ కూడా తన సూపర్ హీరోనే అని స్పష్టం చేసింది. దీంతో ఈ సమాధానం విన్నవారందరికీ మతిపోయింది. ఒకరకంగా ఇలాంటి బోల్డ్ స్టేట్ మెంట్ ఆమెనుంచి వస్తుందని ఊహించని సినీ జనాలకు షాక్ తగిలినట్లైంది. మొత్తానికి తెలుగు పరిశ్రమలో తోపైన హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ అని చెప్పకనే చెప్పిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత ఏడాది కాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ముందుగా అడ్వాన్స్ లిచ్చిన నిర్మాతలకు వాటిని తిరిగిచ్చేసింది.












Click it and Unblock the Notifications