నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటే.. పీక పిసికి చంపుతా: సమంత
తెలగుులో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో సమంత.. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్య సమంత గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.. ఎక్కడా వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. అయితే సమంత మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో పరోక్షంగా నాగచైతన్యపై విమర్శల దాడిచేసింది. అయినా అభిమానులు మాత్రం వీరిద్దరూ కలిసిపోవాలని, మంచి జంట అంటూ ఎంతో అభిలషించారు. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది.
విడాకులు తీసుకున్న తర్వాతే మరింత పాపులారిటీ
సమంత హీరోయిన్ గా కన్నా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాతే మరింత పాపులర్ అయింది. ఇప్పుడు కాకపోయినా మరొక రోజైనా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోక తప్పదు. ఎందుకంటే నాగార్జున ఒప్పుకోరు. ఇప్పటికే పెళ్లి చేసుకోవాలంటూ నాగచైతన్యపై ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన ఎప్పటికైనా నాగచైతన్య-సమంత తిరిగి కలిసిపోతారంటూ బల్లగుద్ది మరీ చెప్పారు. తాను ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెబుతున్నాననే విషయాన్ని రామారావు గుర్తుచేశారు. నాగచైతన్యతో విడిపోయిన దగ్గరనుంచి సమంత ఎంతో మానసకి క్షోభకు గురవుతోందన్నారు.

నాగచైతన్యను వదులుకొని తప్పుచేశా
నాగచైతన్యను వదులుకొని తాను ఎంతో తప్పు చేశాను అని సమంత కుమిలిపోతోంది.. ఈ విషయం తనకు తెలుసని, ఎందుకు నాగచైతన్యను వదులుకున్నానా? అంటూ ఈరోజుకు బాధపడుతోంది.. అలా కాకుండా సమంత వేరేవిధంగా మాట్లాడుతోంది.. అంటూ వచ్చే వ్యాఖ్యలన్నీ పుకార్లే అన్నారు. నాగచైతన్య ఒకవేళ ఎవరినైనా రెండో పెళ్లి చేసుకుంటే అతన్ని పీకి పిసికి చంపినా చంపుతుంది అని, అందులో ఎటువంటి అనుమానానికి, సందేహానికి తావులేదని రామారావు స్పష్టం చేశారు. ఎప్పటికైనా వారిద్దరూ కలుస్తారని, ఇది మాత్రం నిస్సందేహంగా నిజమన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications