విడిపోకుండా ఉంటే నా జీవితం మరో సావిత్రిలా అయ్యేది: సమంత
తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న సమంత గురించి సినీ ప్రియులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. దక్షిణాదిలో అగ్ర హీరోలందరి సరసన నటించింది. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకోవడం.. తర్వాత ఇద్దరూ విడిపోవడం అన్నీ వరుసగా జరిగిపోయాయి. అప్పుడప్పుడు నాగచైతన్య గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసి వివాదాస్పదంగా నిలిచేది. నాగచైతన్య మాత్రం విడిపోయిన తర్వాత ఎక్కడా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ విషయంలో అక్కినేని అభిమానులందరూ నాగచైతన్యకే మద్దతుగా నిలుస్తున్నారు.
తన జీవితం కూడా సావిత్రిలా అయ్యేది..
ఒక సందర్భంలో ప్రేమ గురించి సమంత వ్యాఖ్యలు చేసింది. తన జీవితం కూడా మరో సావిత్రిలా అయ్యేదని, తృటిలో తప్పించుకున్నానని చెప్పింది. మొదట్లో సావిత్రి గురించి తనకు పెద్దగా తెలియదని, మహానటి సినిమా చేసే సమయంలోనే ఆమె గురించి పూర్తిగా తెలిసిందని, సావిత్రిగారిలా తాను కూడా ప్రేమ విషయంలో మోసపోయానని, అదృష్టవశాత్తూ దాన్నుంచి బయటపడ్డానని, లేదంటే తన జీవితం కూడా సావిత్రిగారిలానే అయ్యేదని చెప్పింది. గతంలో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

నాగచైతన్య గురించా? సిద్ధార్థ్ గురించా?
సావిత్రి జెమినీ గణేశన్ ను వివాహం చేసుకున్న తర్వాత అతను మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని భరించలేక సావిత్రి వ్యసనాలకు బానిసై ఆస్తులను పోగొట్టుకొని కోమాలోకి వెళ్లి చివరి శ్వాస విడిచేవరకు జీవచ్ఛవంలా బతికింది. ప్రేమ విషయంలో మోసపోయిన తన జీవితం కూడా అలాగే మారివుండేదని సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సిద్ధార్థ గురించే అని కొందరు.. కాదు నాగచైతన్య గురించి అని మరికొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోపాటు తర్వాత విడాకులు తీసుకుంది. ప్రేమకు సంబంధించి అన్నది కాబట్టి ఆ మాటలు సిద్ధార్థ్ గురించే అని కొందరు తేల్చేశారు.












Click it and Unblock the Notifications