డీజే టిల్లుతో సమంత రొమాన్స్?
విడాకులు తీసుకొని కొద్దిరోజులు, అనారోగ్యం బారిన పడి కొద్దిరోజులు వార్తల్లో నిలిచిన సమంత మయోసైటిస్ కోసం చికిత్స చేయించుకునేందుకు అమెరికా వెళ్లి వచ్చింది. నెలరోజులు అక్కడుండి తిరిగి వచ్చిన సామ్ ప్రాజెక్టులను ఎంపిక చేసుకునే విషయంలో బిజీగా ఉంది. సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసుకునేందుకు పాన్ ఇండియా సినిమాలు తీసే నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డతో సినిమా చేయబోతోందని ప్రచారం నడుస్తోంది.
నందినిరెడ్డి, సమంత.. ఇద్దరూ మంచి స్నేహితులు. జబర్దస్త్, ఓబేబీ లాంటి సినిమాలు కూడా చేశారు. తాజాగా నందినిరెడ్డి దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, సమంత హీరోయిన్ గా ప్రాజెక్టు ఒకటి రాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. గతంలో ఈ సినిమాలో హీరోగా నాగచైతన్య నటిస్తాడని ప్రచారం జరిగిందికానీ తాజాగా ఆ స్థానంలో డీజే టిల్లు వచ్చాడు. దీనిపై అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి. వాస్తవానికి సమంతకు ఉన్న క్రేజ్, అనుభవంతో పోల్చినా డీజే టిల్లు చిన్నవాడే. కానీ తన స్నేహితురాలు కోసం ఈ ప్రాజెక్టు చేసేందుకు సామ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

అలాగే రెమ్యునరేషన్ కూడా సమంత భారీగా తీసుకుంటుంది. కానీ నందినిరెడ్డి తన స్నేహితురాలు కావడంతో ఆమె కోసమే ఈ సినిమా చేస్తున్నట్లు సమాచారం. క్రేజ్ తగ్గించుకొని, రెమ్యునరేషన్ తగ్గించుకొని సమంత డీజేటిల్లుతో సినిమా చేయాల్సిన అవసరం ఏముందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నాగచైతన్యను తీసుకుంటే బాగుంటుందని సూచనలిస్తున్నారు. మరి నందినిరెడ్డి ఏం చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications