మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సమంత
తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కొన్ని మంచి సినిమాల్లో తన నటనద్వారా తనను తాను నిరూపించుకోవడమే కాకుండా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మయోసైటిస్ సోకడంతో చికిత్స చేయించుకునేందుకు సినిమాలకు ఏడాది సమయం విరామం ప్రకటించింది. ఆ సమయంలో నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ లను కూడా తిరిగి వెనక్కిచ్చేసింది. తాజాగా కథలను వింటూ సొంత నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేస్తోంది. ఇది కథానాయిక ప్రాధాన్యం గల సినిమా.
రిక్వెస్ట్ చేసిన గౌతమ్ మీనన్
ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తోంది. ఇది త్వరలోనే విడుదల కాబోతోంది. వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ఈ బ్యూటీకి మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మమ్ముట్టి ఓ సినిమా చేయబోతున్నారు. ఈనెల 15వ తేదీన చెన్నైలో షూటింగ్ ప్రారంభమవుతోంది. సమంత చేసిన మొదటి సినిమా ఏ మాయ చేశావేకు దర్శకుడు కూడా గౌతమ్ మీననే. అతను రిక్వెస్ట్ చేయడంతో ఈ సినిమాలో చేయడానికి సమంత ఒప్పుకుందని తెలుస్తోంది. 20వ తేదీన సెట్స్ లో చేరబోతోంది.

72 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా..
మమ్ముటి, సమంత కలిసి గతంలో ఓ వాణిజ్య ప్రకటన చేశారు. మమ్ముట్టితో తొలిసారి వెండితెరను సామ్ పంచుకోబోతోంది. వరుసగా సూపర్ హిట్లను అందిస్తూ మమ్ముట్టి మంచి జోరుమీదున్నారు. భ్రమయుగంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. సమంతతో చేయబోయేది మూడో సినిమా. 72 సంవత్సరాల వయసులోను కుర్ర హీరోలా మమ్ముట్టి సినిమాలు చేస్తుండటం ఆశ్చర్యపరుస్తోందని మాలీవుడ్ ప్రముఖలు వ్యాఖ్యానిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది.












Click it and Unblock the Notifications