బిగ్ బ్రేకింగ్: బాలకృష్ణ సినిమాలో సమంత?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నారు. అగ్ర కథానాయకుల్లో ఎవరికీ సాధ్యంకాని రీతుల్లో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాల తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీన్ని విజయదశమికి విడుదల చేయబోతున్నారు. బాలయ్య సినిమాకు తగినట్లుగా బాబీ భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం రంగంలోకి దించుతున్నారు.
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ నగర్ లో ఒక వార్త వైరల్ గా మారింది. అగ్ర కథానాయిక సమంత బాలయ్య సినిమాలో నటించబోతోంది అనేది ఆ వార్త సారాంశం. అయితే అందులో నిజం లేదు. ఈ సినిమాలో దర్శకుడు ఏమాయ చేశావే సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇందులో యాడ్ చేశారు. సందర్భానుసారంగా ఇవి సినిమాలో మంచి కామెడీని పండిస్తాయని, థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు వీటిని చూసి పరమానంద భరితులవుతారని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే సమంత నటించడంలేదని, పరోక్షంగా నటిస్తోందంటున్నారు.

ఏమాయ చేశావే సినిమాలో జెస్సీ కార్తీక్ తో చెప్పినట్లు.. నాకంటే నువ్వు రెండు సంవత్సరాలు చిన్నవాడివేనని, పర్వాలేదని ఎవరైనా అడిగితే తమ్ముడని చెప్పేస్తానని జెస్సీ అంటుంది. ఈ తరహా డైలాగులు కొన్నింటిని దర్శకుడు బాబీ ఈ సినిమాలో రీక్రియేట్ చేస్తున్నారు. ఈ డైలాగులు బాలయ్య నోటివెంట వింటే మాములుగా ఉండదని, అదిరిపోతుందని అభిమానులు సంబరపడుతున్నారు. రానున్న రోజుల్లో తమ బాలయ్య సరసన సమంత హీరోయిన్ గా చేస్తుందనే విశ్వాసాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. వారి కోరిక నెరవేరుతుందేమో చూద్దాం.












Click it and Unblock the Notifications