ఆ పనికి మొగుడితో పనిలేదు..పిల్లల్ని కంటాను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఓ హీరోయిన్ తన మనస్సులోని వింత కోరికను బయటపెట్టింది.పెళ్లితో ఎటువంటి సంబంధం లేకుండా తల్లిని కావాలని ఉందని చెప్పి హీరోయిన్ సంచలనం సృష్టించింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..టీనా దత్తా. తనదైన అందంతో టీనా దత్తా బాలీవుడ్ కుర్రకారును కట్టిపడేసింది.టీనా దత్తా బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. అనేక టీవీ షోలలో కనిపించి సందడి చేసింది. 'ఉత్తరాన్' సీరియల్‌లో ఇచ్ఛా పాత్రతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ఆమె 'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 7' , 'బిగ్ బాస్ 16' వంటి రియాలిటీ షోలలో కూడా పాల్గొంది.
పరిణీత ,చోకర్ బాలి,బిష్ ,మీరు నా శాశ్వతంగా ఉన్నారు వంటి సినిమాల్లో నటించింది. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది మరియు తన అభిమానులతో నిరంతరం కనెక్ట్ అవుతుంది. తాజాగా ఈ భామ పెళ్లి, పిల్లలు గురించి స్పందించింది.పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ,పిల్లల్ని మాత్రం కనాలని ఉందని మన మనస్సులోని కోరికను అమ్మడు బయటపెట్టింది. అయితే తల్లిని ఎలా కావాలనేది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదని టీనా దత్తా చెప్పుకొచ్చింది.

దత్తత తీసుకోవడం లేదా సరోగసీ ద్వారా తల్లి కావాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది.కానీ సరైన సమయం వచ్చినప్పుడు మంచి తల్లిని అని నిరూపించుకుంటానని తెలిపింది. బిడ్డను దత్తత తీసుకోవడమా లేదా సరోగసీ ద్వారా తల్లిని కావడమా అనేది ఇంకా డిసైడ్ కాలేదని టీనా దత్తా పేర్కొంది.ఒంటరిగా నా కుటుంబాన్ని నేను చూసుకోగలనని నమ్ముతున్నానని ఈ హాట్ బ్యూటీ చెప్పుకొచ్చింది. నా జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, నా తల్లిదండ్రుల మద్దతుతోనే ఉంటుందని టీనా దత్తా చెప్పుకొచ్చింది. టీనా దత్తా పెళ్లి, పిల్లలు గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications