స్టేజ్‌పై బూతులు మాట్లాడిన తెలుగు హీరోయిన్.. ఆ పదం వాడటంతో అంతా షాక్
వైష్ణవి చైతన్య.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబ్‌లో అమ్మడుకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 'సాఫ్ట్‌వేర్ డెవలపర్' షార్ట్ ఫిలింతో వైష్ణవి చైతన్య ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. యూట్యూబ్‌లో సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి సినిమాల్లో కూడా అవకాశాలు దక్కాయి. తొలుత సైడ్ క్యారెక్టర్లలో నటించిన వైష్ణవి చైతన్య, ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వైష్ణవి చైతన్య 2018లో 'టచ్ చేసి చూడు' సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'అలా వైకుంఠపురములో' (2020), 'వరుడు కావలెను' (2021), 'టక్ జగదీష్' (2021), 'వలిమై' (2022), 'ప్రేమదేశం' (2023) వంటి చిత్రాల్లో నటించింది.
Fc*k అంటూ కవర్ చేసిన వైష్ణవి చైతన్య | #vaishnavichaitanya #SiddhuJonnalagadda #Jack #Teluguoneindia #Oneindiatelugu pic.twitter.com/0XgzCElTqI
— oneindiatelugu (@oneindiatelugu) April 7, 2025
2023లో విడుదలైన 'బేబీ' సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలోని నటనకు గాను ఆమె ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు ఉత్తమ నటి , SIIMA ఉత్తమ మహిళా డెబ్యూ - తెలుగు అవార్డులను గెలుచుకుంది. 'బేబీ' సినిమాతో వైష్ణవి చైతన్య కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. వైష్ణవి చైతన్య తాజాగా నటించిన చిత్రం 'జాక్'.ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సిద్దు జొన్నలగడ్డ ,హీరోయిన్ వైష్ణవి చైతన్య పలు ప్రాంతాల్లో సందడి చేశారు.

దీనిలో భాగంగా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. 'మా 'జాక్' ఈవెంట్‌ను మీ అందరి ముందు, మీ ఎనర్జీతో షేర్ చేసుకుంటున్నందుకు.. మీ రాజమండ్రిలో షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే ఈవెంట్ జరిగింది భీమవరంలో. దీంతో వెంటనే అప్రమత్తం అయిన హీరో సిద్దు జొన్నలగడ్డ వైష్ణవి చైతన్యను అలెర్ట్ చేశారు. ఇది భీమవరం అని హీరోయిన్‌కు గుర్తు చేశారు. దీనిపై వైష్ణవి చైతన్య 'హో ఫక్' మర్చిపోయా.. అంటూ కవర్ చేసుకుంది. అయితే స్టేజ్ మీద అంతమంది ముందు ఇలా బూతులు మాట్లాడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications