చిన్న సినిమాకు కలెక్షన్ల సునామీ.. ఇలా ఎలా తీశారబ్బా..!
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ హీరోగా నటించిన 'హే బల్‌వంత్' మూవీ ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీలో శివానీ నగరం హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి గోపీ అచ్చర దర్శకత్వం వహించారు. అయితే విభిన్నమైన కథలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. చేసేవి చిన్న సినిమాలే అయినా కంటెంట్ ఉన్న కథలతో వచ్చి హిట్ కొడుతుంటాడు. అయితే తాజాగా 'హే బల్‌వంత్' మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో..
హే బల్‌వంత్ మూవీకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూవీలో సుహాస్, శివానీ నగరం జోడీకి ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ లభించాయి. తాజాగా ఇదే విషయంపై మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. మొదటిరోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కినట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రంలో నరేష్, వెన్నెల కిషోర్, స్రవంతి చొక్కారపు, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ, ఎమోషన్స్ ప్రధానంగా సాగిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. మంచి జీవితానికి చదువును మించిన షాట్ కట్ లేదని చక్కటి సందేశమిచ్చే చిత్రమే ఇదని తెలుస్తోంది. ఈ వీకెండ్ లో హే బల్‌వంత్ మూవీకి భారీగానే కలెక్షన్స్ వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి లాంగ్ రన్ లో ఈ కామెడీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ఎంత మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.

ఇక 'లిటిల్ హార్ట్స్, 'రాజు వెడ్స్ రాంబాయి', 'ఈషా' వంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీ వాస్, వంశీ నందిపాటిలు తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై 'హే బల్‌వంత్ ఎంటర్ టైనర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇది కూడా ఆ సినిమాల మాదిరిగానే హిట్ లిస్ట్ లో చేరిపోయింది. అలాగే సుహాస్, శివాని నగరం గతంలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీకి మొదట హే భగవాన్ టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమా పేరు మార్చాలని సూచించడంతో చిత్ర బృందం దీని టైటిల్ ను మార్చింది. 'హే భగవాన్'ను 'హే బల్వంత్' గా మారుస్తున్నట్లు ప్రకటించింది.
-
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!












Click it and Unblock the Notifications