మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బీర్లు తెలుసా?
బీరు తాగడంవల్ల లాభాలున్నాయి.. నష్టాలున్నాయి. అయితే ఏదైనా మంచి అలవాటు అనుకున్నప్పుడు దాన్ని కొనసాగించుకోవాలి. అలాగే అది చెడు అలవాటు అనుకున్నప్పుడు దాన్ని వదిలించుకోవాలి. ఆ జోలికి వెళ్లకూడదు. అలాగే ఆల్కహాల్ శాతం ఉండే బీరు కూడా మంచి అలవాటు అనిపించుకోదు. సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు తీసుకుంటున్నాంకదా.. అది బ్రాందీ, విస్కీలాంటిది కాదుకదా.. చాలా లైట్ గా ఉంటుందికదా అనుకుంటే అది మీ మనస్తత్వాలపై ఆధారపడివుంటుంది. వాస్తవానికి ఆల్కహాల్ సేవించడం అనేది ప్రస్తుతం ఒక ఫ్యాషన్ లా మారిపోయింది. అందుకు తగినట్లుగానే మనదేశంలో వీటి అమ్మకాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయేకానీ తగ్గడంలేదు.
మనదేశంలో యువత బీర్లను బాగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం వీకెండ్ అనే ట్రెండ్ నడుస్తుండటంతో బీర్లతో పార్టీ చేసుకుంటున్నారు. పట్టణాలు, నగరాల్లో ఎక్కడ చూసినా రోడ్లపై పగిలిపోయిన బీరు సీసాలే కనపడతాయి. మనదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే బీర్లలో మొదటి స్థానంలో కింగ్ ఫిషర్ నిలుస్తుంది. దీని మార్కెట్ వాటా 41 శాతం. రెండోస్థానంలో హేవార్డ్స్ 5000 నిలుస్తుంది. మార్కెట్ లో దీని వాటా 15 శాతంగా ఉంది. మూడోస్థానంలో నాకౌట్ నిలిచింది. దీని మార్కెట్ వాటా 8.7 శాతం. అలాగే కల్యాణి బ్లాక్ లేబుల్ 2.7 శాతం మార్కెట్ తో నాలుగో స్థానంలో నిలిచింది. దీని అమ్మకాలు పశ్చిమ బెంగాల్ తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. చివరగా ఐదో స్థానంలో రెండు శాతం మార్కెట్ తో బడ్వైజర్ నిలిచింది.

బీరు సేవిస్తే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే పరిమితంగా తీసుకుంటేనే దీని ఉపయోగాలు శరీరానికి అందుతాయి. ప్రొటీన్, ఫైబర్, విటమిన్ బి వంటి పోషకాలు కూడా బీరులో ఉంటాయి. ఒక బీరు సీసాలో 125 కేలరీలు ఉంటాయి. శరీరంలో హెచ్ డీఎల్ స్థాయిని పెంచి గుండెపోటును నివారిస్తుంది. అయితే షుగరు ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ తగ్గిపోతుంది.












Click it and Unblock the Notifications