Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంచలన నిర్ణయం తీసుకున్న బడా నిర్మాణ సంస్థ.. గెట్ రెడీ !

ప్రముఖ నిర్మాణ సంస్థ "Hombale Films" గురించి దక్షిణాది ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. 2012లో విజయ్ కిరంగదూర్ స్థాపించిన హోంబలే ఫిల్మ్స్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌తో తొలి చిత్రాన్ని నిర్మించి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది KGF: Chapter 1. ఆ తర్వాత Kantara, Salaar: Part 1 - Ceasefire వంటి భారీ చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్‌లో దూసుకెళ్లింది. దర్శకులు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి లాంటి ప్రతిభావంతులతో కలిసి బ్లాక్‌బస్టర్లు అందించింది. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు ప్రొడక్షన్ రంగంలోనే ఆధిపత్యం చాటిన ఈ బ్యానర్‌.. లేటెస్ట్ గా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అధికారికంగా అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. భారతీయ కథలను ప్రపంచంలోని ప్రతి మూలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా విదేశాల్లో భారతీయ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, సరైన ప్రణాళికతో విడుదలలు జరగడం లేదనే అభిప్రాయం పరిశ్రమలో ఉంది. ఈ నేపథ్యంలోనే హోంబలే ఫిల్మ్స్ స్వయంగా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించిందని భావిస్తున్నారు.

hombale-films-production-house-new-decision-about-coming-into-overseas-distribution

ఈ మేరకు సోషల్ మీడియాలో "సినిమా అనేది సరిహద్దులు లేని అనుభూతి. భారత్ నుంచి ప్రపంచానికి మన కథలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ విభాగాన్ని ప్రారంభిస్తున్నాం" అని సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా దక్షిణాది చిత్రాలు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల్లో మరింత విస్తృతంగా విడుదలయ్యే అవకాశం ఉంది. పక్కా మార్కెటింగ్ స్ట్రాటజీ, భారీ స్క్రీన్ కౌంట్, ప్రీమియర్ షోలు వంటి అంశాలతో ఓవర్సీస్ వసూళ్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ కేవలం నిర్మాణంలోనే కాకుండా, భారత్‌లో డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా అనుభవం సంపాదించింది. 'మహావతార నరసింహ', 'మిరాయ్', L2: Empuraan వంటి చిత్రాలను పంపిణీ చేసి మంచి ఫలితాలు సాధించింది. ఇప్పుడు అదే అనుభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ చేతిలో పలు ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. కాంతార ప్రీక్వెల్, సలార్ 2, కేజీఎఫ్ 3, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న 'డ్రాగన్' ఈ సినిమాలను స్వయంగా ఓవర్సీస్‌లో విడుదల చేస్తే.. వసూళ్లు మునుపెన్నడూ లేని స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా.

ఇక ఈ నిర్ణయంతో హోంబలే ఫిల్మ్స్ కేవలం ఒక ప్రొడక్షన్ హౌస్‌గా కాకుండా, గ్లోబల్ మీడియా పవర్‌హౌస్గా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో తమ సినిమాలే కాకుండా ఇతర భాషల భారతీయ చిత్రాలను కూడా ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం ఉంది. భారతీయ సినిమా ఇప్పుడు గ్లోబల్ స్టేజ్‌పై కొత్త అధ్యాయం ప్రారంభించబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+