అతను నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు బాలకృష్ణ హీరోయిన్ సంచలన కామెంట్స్

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ హానీరోజ్‌ లైంగిక వేధింపులకు గురయ్యారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

హానీరోజ్‌ తన‌కు ఎదురైన లైంగిక వేధింపుల గురించి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. గతంలో తాను ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరయ్యానని, ఆ ఈవెంట్ నిర్వహించిన వ్యక్తి అప్పటి నన్ను వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడకు వస్తూ తనని టార్చర్ చేస్తున్నాడని హానీరోజ్‌ తెలిపింది.సోషల్ మీడియాలో నా పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడు. బిజినెస్ మేన్ కావడంతో, చట్టపరంగానే అతనిపై పోరాటం చేస్తానని హానీరోజ్‌ పేర్కొంది. భారత న్యాయవ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుండు, 20 ఏళ్లుగా పరిశ్రమలో ఉంటున్న తాను ఆ బిజినెస్ మేన్ వేధింపులను ఎందుకు భరించాలి అని హానీరోజ్‌ ప్రశ్నించింది.

Honeyrose shared a post on her social media about the sexual harassment she faced

మరోవైపు హనీ రోజ్‌ను అసభ్యకరంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని తిరువనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక హనీ రోజ్‌ కెరీర్ విషయానికి వస్తే..ఈ అమ్మడు తెలుగులో 'ఆలయం' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన హానీ రోజ్, 'వీరసింహారెడ్డి' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో బాలకృష్ణ భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.హానీ రోజ్ కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. తన అందమైన ఫోటోలు, వీడియోలను తరచూ పంచుకుంటూ తన ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవుతుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+