అనిల్ రావిపూడితో మూవీకి చిరు ఎన్ని రోజులు డేట్స్ ఇచ్చారంటే..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ 2025 సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లను కూడా ప్రకటించారు మెగాస్టార్.
దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ చేయనున్నట్లు ప్రకటించారు. అలానే అనిల్ రావిపూడితో కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరంజీవితో చేయబోయే సినిమా గురించి అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్లు చేశారు. మరో నాలుగు నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని కూడా తెలియజేశారు. కామెడీ ఎంటర్ టైనర్ లాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

అయితే అనిల్ - చిరు కాంబినేషన్ లో రాబోతున్న మూవీ గురించి మరో ఆసక్తికర విషయం టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ కోసం చిరు 90 రోజుల కాల్ షీట్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మే నెలలో స్టార్ట్ అయి అక్టోబర్‌లో పూర్తి అవుతుందని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి నెట్టింట్లో అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ గురించి పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ఏకంగా రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు సినిమా హిట్ అయి లాభాలు వస్తే లాభాల్లో వాటాలు తీసుకునేందుకు డేల్ సెట్ చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి మీద నమ్మకంతో నిర్మాత సైతం ఆ డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.
ఇక రీసెంట్ గానే సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు.












Click it and Unblock the Notifications