మహేష్ బాబు కూతురు సితార సంపాదన ఎంతో తెలుసా?

తెలుగు చలనచిత్ర సీమలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేనంత క్రేజ్ ను ఆయన సంపాదించుకున్నారు. ఆయన ఎంత పేరు తెచ్చుకున్నారో ఆయన కూతురు సితార కూడా అంతే పేరు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో పోటీపడుతూ ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. చిన్నవయసులోనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాతో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగివుంటున్నారు. దీనిద్వారా ఆమె భారీగా ఆర్జిస్తున్నారు.

ఇ‌న్‌‌స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత విషయాలను పంచుకోవడంద్వారా రోజురోజుకు పాపులారిటీని పెంచుకుంటూ వెళుతోంది. నెలకు ఈ ఖాతాద్వారా రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు సంపాదిస్తోంది. ఈ విషయంలో ఆమె స్టార్ హీరోయిన్లను కూడా వెనక్కి నెట్టిసిందంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తండ్రికి తగ్గ కూతురంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

how much Mahesh Babus daughter Sitara earning?

సితార స్టైలిష్ లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఘట్టమనేని కుటుంబం నుంచి త్వరలోనే హీరోయిన్ రాబోతోందంటున్నారు. వాస్తవానికి ఈ కుటుంబం నుంచి గతంలోనే కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ గా రావాల్సి ఉన్నప్పటికీ కృష్ణ అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడంతో ఆమె తన కోరికను తీర్చుకోలేకపోయారు. తాజాగా తమ మేనకోడలు సితారను హీరోయిన్ గా తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారంటున్నారు.

గుంటూరు కారం సినిమా ఫ్లాపైనప్పటికీ మహేష్ బాబు నటన, డ్యాన్స్ లకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా పరాజయం పొందడంతో ప్రిన్స్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీకి సిద్ధమవుతున్నాడు. ఫిట్నెస్ విషయంలో శిక్షణ తీసుకునేందుకు జర్మనీ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగిరాగానే సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి నిర్మాతగా డాక్టర్ కేఎల్ నారాయణ వ్యవహరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+