భారీ సెట్, 1500 మందితో ఎన్టీఆర్, నీల్ మూవీ ఫస్ట్ డే ఘాట్.. ఎక్కడంటే ?
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండేళ్ల నుంచి ఎన్టీఆర్ నీల్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత ఏడాదిలో సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర దించుతూ ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ రేపటి నుంచి భారీ ఎత్తున షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే షూటింగ్ కోసం ఒక భారీ సెట్టింగ్ వేశారని.. దాదాపు 1500 మంది జూనియర్ ఆర్టిస్టులతో మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుందని టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమా కూడా కేజీఎఫ్, సలార్ సినిమాల కంటే కూడా భారీ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాను 2026 చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక వచ్చే ఏడాదిలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందనున్న సలార్ 2 సినిమా సైతం రానుంది. మరోవైపు అతి త్వరలోనే సలార్ 2 సినిమా బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేయనున్నట్టు కూడా అనుకుంటున్నారు. ఎన్టీఆర్ - నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక గత ఏడాది ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఏడాది ఆగస్టులో 'వార్ 2' సినిమాతో రాబోతున్నారు. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తూ ఉండగా.. కీలక పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. త్వరలోనే వార్ 2 మేకర్స్ ఎన్టీఆర్ లుక్‌తో పాటు, టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ నుంచి ఎన్టీఆర్ పిక్స్ లీక్ అయ్యి వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications