ప్లీజ్.. ఐ కైండ్ లీ రిక్వెస్ట్: 'సలార్'
మందుబాబులకు హైదరాబాద్ పోలీస్ హెచ్చరిక జారీచేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ను అందుకు ఉపయోగించుకుంది. డార్లింగ్ కొత్త సినిమా 'సలార్' సినిమాలోని పాపులర్ డైలాగ్ ఉపయోగించి డ్రంక్ & డ్రైవ్ వల్ల కలిగే నష్టం గురించి సోషల్ మీడియాలో చెబుతోంది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రపంచం అంతా సిద్ధమైందనే విషయం తెలిసిందే.
ఆ ప్రపంచంలో మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో పలు పబ్‌లు, రెస్టారెంట్లలో న్యూ ఇయర్ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ ఒక్క రోజు రాత్రి మద్యం అమ్మకాలు గణనీయంగా ఉంటాయని తెలుస్తోంది. ఆబ్కారీ శాఖ విడుదల చేసే గణాంకాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. మందు తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయనే విషయాన్ని ప్రభాస్ డైలాగ్ ద్వారా చెబుతున్నారు.

'ముట్టుకోవద్దని చెప్పాను కదరా'... 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్' సినిమాలో ప్రభాస్ చెప్పిన ఈ డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. హైదరాబాద్ సిటీ పోలీస్ రూపొందించిన డ్రంక్ అండ్ డ్రైవ్ యాడ్‌లో ఆ డైలాగ్ వాడారు. మందు ముట్టుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయని విజువల్స్ ద్వారా చెప్పారు. 'ప్లీజ్ ఐ కైండ్ లీ రిక్వెస్ట్' డైలాగ్ తర్వాత 'డోంట్ డ్రింక్ & డ్రైవ్' అని పేర్కొన్నారు.
“Don’t let one night of fun turn into a lifetime of guilt.”
— Hyderabad City Police (@hydcitypolice) December 30, 2023
Don't Drink & Drive, Stay Safe.#DriveSafe #DontDrinkAndDrive #ArriveAlive #RoadSafety #SaveLives #Salaar #HyderabadCityPolice pic.twitter.com/e8HYJN5la7
సలార్ చిత్రం రూ.600 కోట్లు వసూలు చేసింది. థియేటర్లలో ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. హిందీలో రూ.110 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. రూ.వెయ్యి కోట్లు వసూలు చేసే దిశగా పయనిస్తోంది. అయితే రూ.వెయ్యి కోట్లు వస్తాయా? రావా? అనే టెన్షన్ మాత్రం ట్రేడ్ వర్గాల్లో ఉంది. నైజాంలో మొదటిసారిగా లాభాల్లోకి అడుగుపెట్టింది.












Click it and Unblock the Notifications