కావ్య మారన్ ఎవరిని ప్రేమిస్తుందో తెలుసా?
మనదేశంలోని ప్రతి క్రికెట్ ప్రేమికుడికి కావ్య మారన్ పేరు తెలియకుండా ఉండదు. దేశవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ టీంకు యజమాని అయిన తర్వాతే ఆమె ఎక్కువ పాపులర్ అయింది. ఐపీఎల్ వేలం జరుగుతుంటే కెమెరా మాత్రం కావ్యనే చూపిస్తుంది. సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కూతురు కావ్య మారన్. మనదేశంలో అధిక వేతనం పొందుతున్న సీఈవోల్లో ఈమె కూడా ఒకరు. తన తండ్రి స్థాపించిన రూ.33వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఆమె ఒక్కటే వారసురాలు.
వ్యక్తిగత ఆస్తులు రూ.417 కోట్లు
కావ్యకు వ్యక్తిగతంగా రూ.417 కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నాయి. సన్ టీవీ నెట్ వర్క్ పనులు చూస్తుండే కావ్య ఆపదలో ఉన్నవారికి వెంటనే సహాయం చేస్తుంది. ప్రధానంగా క్యాన్సర్ రోగులకు అధిక సాయం చేస్తుంటుంది. అలాగే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సన్ గ్రూప్ తరఫున సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులకు వారసురాలైన కావ్య మారన్ కు కార్లు అంటే బాగా ఇష్టం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను ఆమె సొంతం చేసుకుంది. మార్కెట్ లోకి వచ్చే అత్యంత ఖరీదైన ప్రతి కారును కొనుగోలు చేయడం ఈమెకు అలవాటు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్
వీటిల్లో ప్రధానమైంది.. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఈ తరహా కారు ఒకటి ఉందని చాలామందికి తెలియదు. రూ.8 కోట్ల విలువచేసే లగ్జరీ కారు సెడాన్ ఉంది. 563 హార్స్ పవర్ దీనిసొంతం. అలాగే 600 హార్స్ పవర్ ఉన్న బెంట్లీ బెంటాయ్గా ఎస్ యూవీ ఉంది. దీని ధర రూ.4 కోట్లు. రూ.2.5 కోట్ల విలువ చేసే ఫెర్రారీ రోమా స్పోర్ట్స్ కారు ఉంది. 570 హార్స్ పవర్ దీనిసొంతం. ప్రీమియం సెడాన్ బిఎమ్‌డబ్ల్యూ ఐ7 ఉంది. రూ.1.6 కోట్ల విలువచేస్తుంది. అలాగే మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, పోర్ష్ 911, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ తోపాటు పలు కంపెనీలకు చెందిన అనేక కార్లు ఉన్నాయి. దీంతో నెటిజన్లు కావ్యమారన్ పాప కార్లతో ప్రేమలో పడిందంటూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications