అతనితో రొమాన్స్ చేయడానికి సిద్ధం - సానియా మీర్జా
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణీ సానియా మీర్జా వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసిన సంగతి అందరికి తెలిసిందే. సానియా మీర్జా తన 15 ఏళ్ల దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పింది. భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో .. అతనితో సానియా మీర్జా బంధం తెగిపోయినట్టు అయింది. షోయబ్ మాలిక్ పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.
సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ ఎఫైర్ కారణంగానే సానియా మీర్జా భర్తతో విడిపోయింది. విడాకులపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. సంప్రదాయం ప్రకారమే సానియా మీర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకుందని ఆయన తెలిపారు.విడాకుల తర్వాత సానియా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చినప్పటికీ, ఆమె మాత్రం సింగిల్‌గానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే సానియా మీర్జా జీవితం సినిమాగా తెరకెక్కబోతుంది.

ఆమె జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా 2023లో ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ అయిన వెంటనే, ఆమె జీవితంపై బయోపిక్ రూపొందించే పనులు వేగవంతం అయ్యాయి. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలాకు చెందిన RSVP ఫిల్మ్స్ సానియా బయోపిక్ రైట్స్‌ను పొందినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై 2019లోనే అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ, ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.
ఈ బయోపిక్‌లో సానియా పాత్రను ఎవరు పోషిస్తారు, దర్శకుడు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. గతంలో, సానియా స్వయంగా దీపికా పడుకొనే లేదా పరిణీతి చోప్రా తన పాత్రకు సరిపోతారని సూచించింది. అయితే, పరిణీతి చోప్రా ఇప్పటికే సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించినందున, ఆమె ఈ ప్రాజెక్ట్‌లో ఉండే అవకాశం లేదు. తాజాగా సానియా తన బయోపిక్ గురించి స్పందించింది.
తన బయోపిక్‌లో హీరోగా బాలీవుడ్ 'ఖిలాడీ' అక్షయ్ కుమార్‌ను ఊహించుకుంటున్నట్లు వెల్లడించింది. తాను అక్షయ్ కుమార్‌కు చాలా పెద్ద అభిమానినని, ఒకవేళ తన బయోపిక్‌లో అతడు నటిస్తే, అక్షయ్‌తో రొమాన్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సరదాగా వ్యాఖ్యానించింది. సానియా చేసిన ఈ ఫన్నీ కామెంట్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications