ఆమెతో విడాకుల తర్వాత మద్యానికి బానిసయ్యా - అమీర్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రంగీలా, లగాన్, 3 ఇడియట్స్, పీకే, దంగల్ సినిమాలతో హిందీలోనే కాకుండా సౌత్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు. దంగల్ సినిమా అయితే రూ. 2000 కోట్లు కలెక్షన్స్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. చివరగా ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ప్రస్తుతం కొంచెం గ్యాప్ తీసుకున్న అమీర్ ఖాన్ ఈసారి గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.
ఇక అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 1986లో ఆయన రీనా దత్తను వివాహం చేసుకున్నాడు. వారికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల వైవాహిక జీవితం అనంతరం రీనాతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావ్ ని రెండో వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. ఇక 2021లో ఆమెతో కూడా విడిపోతున్నట్లు అమీర్ ప్రకటించారు. అయితే కిరణ్ రావ్ తో విడాకులు తీసుకున్నప్పటికీ.. వారిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతుందని అంటున్నారు.

ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన మొదటి భార్య రీనా దత్తాతో విడాకులు తీసుకున్నప్పుడు తాను చాలా కుంగిపోయానని ఎమోషనల్ అయ్యారు. తామిద్దరం చాలా అన్యోన్యంగా జీవించామని కానీ అనుకోని కారణాల వల్ల విడిపోయామంటూ చెప్పుకొచ్చారు. విడాకుల తర్వాత మూడేళ్ల పాటు మామూలు మనిషిలా ఉండలేకపోయానని తెలిపారు. ఆమెను మర్చిపోయేందుకు మద్యానికి బానిస అయ్యానని వ్యాఖ్యానించారు. అంతకుముందు అసలు మద్యం అలవాటు లేదని.. కానీ ఆమెను మర్చిపోవడానికి మద్యం అలవాటు చేసుకున్నానని చెప్పారు.
ఆ కారణంగానే అఆ సమయంలో సినిమాలపై దృష్టి పెట్టలేకపోయానని ఎమోషనల్ అయ్యారు. దాంతో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ నెల 14 తన 60వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్న అమీర్.. ప్రస్తుతం గౌరీ స్ప్రాట్ అనే మహిళతో తాను రిలేషన్ లో ఉన్నానని వెల్లడించారు. చాలా కాలంగా ఆమె అమీర్ ఖాన్ ప్రొడక్షన్ సంస్థలో పని చేస్తుందని తెలుస్తోంది. గౌరీ బెంగుళూరుకు చెందిన మహిళ కాగా ఇప్పటికే భర్తతో విడిపోయారని.. వారికి ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడని సమాచారం.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications