నీ బాత్రూమ్‌లోకి రాలేను కదా.. తెలుగు హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించిన నిర్మాత
తెలుగు హీరోయిన్‌పై నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశారు.నీ బాత్రూమ్‌లోకి రాలేనంటూ అసభ్యకరంగా మాట్లాడారు. ఇలా హీరోయిన్ బాత్రూమ్ గురించి మాట్లాడిన నిర్మాత మరెవరో కాదు..ఎస్కేఎన్. తెలుగు ఇండస్ట్రీలో ఎస్కేఎన్‌కు సపరేటు క్రేజ్ ఉంది. తన మాటలతో అందర్ని ఆకట్టుకుంటారు ఎస్కేఎన్. అయితే ఇదే సమయంలో ఆయన పలు వివాదాల్లో కూడా చిక్కుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
"రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్" సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ, తెలుగు మాట్లాడే హీరోయిన్లను ప్రోత్సహించడం వల్ల కలిగే ఇబ్బందులను తాను తెలుసుకున్నానని, ఇకపై తెలుగు రాని హీరోయిన్లనే ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చాలా మంది నెటిజన్లు, సినీ పరిశ్రమకు చెందిన వారు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలుగు అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని విమర్శించారు. ఈ వివాదంపై ఎస్కేఎన్ స్పందిస్తూ, తాను తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించే కొద్దిమంది నిర్మాతల్లో ఒకడినని వివరణ ఇచ్చారు.

తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, అవి సరదాగా చేసిన వ్యాఖ్యలని అన్నారు. తాను ఇప్పటివరకు 8 మంది తెలుగు హీరోయిన్లను పరిచయం చేశానని, భవిష్యత్తులో మరో 25 మందిని పరిచయం చేయాలని యోచిస్తున్నానని తెలిపారు. "సింగిల్" సినిమా యూనిట్‌తో ఎస్కేఎన్ సరదాగా ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో, హీరోయిన్ కేతిక శర్మను ఆమె బాత్రూమ్‌లోకి రాలేనంటూ అసభ్యకరమైన ప్రశ్న అడిగారు.ఈ వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఎస్కేఎన్ ఒక హీరోయిన్‌తో అలా ఎలా మాట్లాడతారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతిక శర్మ కూడా కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. మరి ఈ వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications