అంకుల్స్ కూడా హింసిస్తున్నారు.. ఓపెన్ అయిన తమన్నా
హీరోయిన్ తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఫుల్ గ్లామర్ ట్రీట్‌తో ఈ పాల బుగ్గల సుందరి అదరగొడుతోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు.
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది. తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది.

ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికీ తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. తమన్నా ఇటీవల కొన్ని ఐటం సాంగ్స్ చేసింది. జైలర్, స్త్రీ2 వంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో తన డ్యాన్స్, ఫిజిక్‌తో కుర్రకారుకు చెమటలు పట్టించింది. తాజాగా రైడ్-2 సినిమాలో మరో ఐటమ్ సాంగ్‌తో అమ్మడు మెరిసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలోని ఐటం సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో తమన్నా తనదైనశైలిలో అందాలను ఆరబోసింది. ఇంకా చెప్పాలంటే కాస్తా ఓవర్‌గానే తన ఎద అందాలను ప్రదర్శించింది తమన్నా. తన ప్రైవేట్ అందాలు చూపిస్తూ రచ్చ చేసింది.
ఇదిలా ఉంటే తమన్నా తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. నేను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు, మా ఇంటి చూట్టు ఉన్న వారు, మా అమ్మ ,నాన్నలను తెగ అవమానించేవారని తమన్నా చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో దారుణ పరిస్ధితులు ఉంటాయని మా అమ్మానాన్నని భయపెట్టారని, వారి మాటలు విని ఉంటే ఇప్పుడు నేను స్టార్ హీరోయిన్ అయి ఉండేదాన్ని కాదని తమన్నా పేర్కొన్నారు.ట్విట్టర్‌లో ఉండే ఆంకుల్స్ కూడా 2023లో అమ్మాయిలు ఎలా ఉండాలో చెబుతుంటారని, బాధ్యత గల మీడియా ఇలాంటి వారి ట్వీట్స్‌ని థంబ్స్‌గా పెట్టడం మంచిది కాదని హితవు పలికింది తమన్నా. ప్రస్తుతం తమన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications