IBomma: 'ఐ బొమ్మ'లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి!
ఏపీ, తెలంగాణలో మల్టీప్లెక్స్ కు కానీ, థియేటర్ కు కానీ వెళ్లి సినిమా చూసే ధైర్యం, సాహసం ఎవరూ చేయడంలేదు. థియేటర్ కు వెళ్లి సినిమా చూద్దామంటే సగటు ప్రేక్షకుడిమీద మోయలేని భారం పడుతోంది. చివరకు వారాంతపు రోజుల్లో వచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని కూడా ఇవి దూరం చేశాయి. ప్రభుత్వాలు మాత్రం కొత్త హీరో సినిమా విడుదలైనప్పుడల్లా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తుంటాయికానీ ధరలను తగ్గించే అవకాశాన్ని మాత్రం పరిశీలించవు. థియేటర్లు, మల్టీప్లెక్స్ ధరలు ఒక ఎత్తయితే వీటిల్లో ఉండే క్యాంటిన్లలోని తినుబండారాల ధరలు మరో ఎత్తు.
రెట్టింపు ఖర్చు అవుతోంది
సినిమా టికెట్ కు ఎంత ఖర్చవుతుందో అంతకు రెట్టింపు ఖర్చవుతుంది అక్కడ ఏమైనా కొనుగోలు చేయాలంటే. ప్రభుత్వాలు మాత్రం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు హడావిడిగా, తూతూ మంత్రగా నాలుగు తనిఖీలు చేసి సరిపెట్టేస్తాయి. తూనికలు, కొలతలశాఖ అనేది ఒకటి ఉందనే విషయం ప్రజలకు చాలామందికి తెలియదు. తెలిసినవారు ఎప్పుడో మర్చిపోయారు. నలుగురు సభ్యులుండే కుటుంబం సినిమా చూడాలంటే కనీసం రూ.3వేల నుంచి రూ.4వేలు అవుతోంది. కరోనా సమయంలో ప్రజలకు ఓటీటీలు బాగా అలవాటుపడ్డాయి.

ఓటీటీలు కూడా ధరలు పెంచాయి
వీటికి ఎప్పుడైతే అలవాటు పడ్డారో అవి కూడా తెలివిగా సబ్ స్క్రిప్షన్ ధరలు పెంచేశాయి. దీంతో సగటు ప్రేక్షకుడు థర్డ్ పార్టీ వెబ్ సైట్ లను ఆశ్రయించక తప్పడంలేదు. అందులో ప్రధానమైంది ఐబొమ్మ. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎక్కువగా దీన్నే వినియోగిస్తున్నారు. కొత్త కొత్త సినిమాలు మాస్టర్ ప్రింట్ తో అందుబాటులో ఉండటమే కాకుండా కొత్త కొత్త వెబ్ సిరీస్ లు కూడా ఉంటున్నాయి. దీంతో ప్రేక్షకులు వీటిని డౌన్ లోడ్ చేసుకొని కుటుంబంతో సహా చూస్తున్నారు.
ప్రస్తుతం ఐబొమ్మలో ఇటీవల విడుదలైన కొత్త సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. వాటిల్లో ఫ్యామిలీస్టార్, ఆ ఒక్కటీ అడక్కు, ఓం భీం బుష్, రజాకార్, వ్యూహం, కలియుగం పట్టణంలో, ఆపరేషన్ వాలెంటైన్, గ్రౌండ్, సైరెన్, పాగల్ వర్సెస్ కాదల్, రాజధాని ఫైల్స్, ముఖ్యగమనిక, ఊరుపేరు భైరవకోన, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, డీజే టిల్లు స్క్వేర్, ఈగల్, గామి, హనుమాన్, యాత్ర2, గుంటూరు కారం, రత్నం, కీచురాళ్లు, టెనెంట్, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం ఉన్నాయి.












Click it and Unblock the Notifications