బన్నీకి అక్కలా ఉంటుంది గురూ..
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. పుష్ప ది రైజ్ సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. దీనికి తగ్గట్లుగా నిర్మాతలు కూడా ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని, దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో అది తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఒకవైపు పుష్ప చేస్తూనే మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నాడు.
ఇప్పటికే దీనికి సంబంధించిన కథ ఫైనలైజ్ అయినట్లు తెలుస్తోంది. పుష్ప షూటింగ్ పూర్తవగానే దీన్ని ప్రారంభించాలనే పట్టుదలతో అల్లు అర్జున్ ఉన్నారు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ దీన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమాలో నటించేందుకు హీరోయిన్ గా గురూజీ త్రిషను ఓకే చేసినట్లు తెలుస్తోంది. కథ ప్రకారం కథానాయిక పాత్ర మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్రలో త్రిష అయితేనే బాగుంటుందని గురూజీ ఆలోచనగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే త్రిష వయసు 41 సంవత్సరాలు. అల్లు అర్జున్ కంటే సంవత్సరం చిన్నది. అయినప్పటికీ అభిమానులు మాత్రం వీరిద్దరి కాంబినేషన్ బాగోదు గురూజీ.. బన్నీకి అక్కలా ఉంటుందేమో.. కాస్త పరిశీలించండి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కథ ప్రకారం త్రిష అయితేనే బాగుంటుందని గురూజీ ఆలోచనగా ఉంది. మరి చివరకు ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతం త్రిష గ్లామర్ పాత్రలు చేయడం తగ్గించింది. కథలో ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటోంది. అల్లు అర్జున్ పక్కన రొమాన్స్ చేయడానికి త్రిష సెట్టవదని అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరకు గురూజీ ఏం చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications