ప్రభాస్ అఫైర్ ను బయట పెట్టిన అల్లు అర్జున్
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా, దేశంలోనే నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్నారు. ప్రస్తుతం కల్కి, రాజాసాబ్ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. దీనితర్వాత స్పిరిట్, సలార్ 2 చిత్రాల్లో నటించాల్సి ఉంది. పుష్ప సినిమాతో బన్నీ కూడా పాన్ ఇండియా హీరో అయిపోయారు. సినిమాలు చేస్తూ ఎవరికివారు బిజీగా ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు కలిసి సరదాగా మాట్లాడుకుంటుంటారు. ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్ డార్లింగ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమాకు సీక్వెల్ గా ఆర్య2 తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఆడియో విడుదల వేడుకకు చాలామంది ప్రముఖులు అతిథులుగా వచ్చారు. వీరిలో డార్లింగ్ ప్రభాస్ కూడా ఉన్నారు. ఆ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ దేవిశ్రీప్రసాద్ తనకు ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చాడని, తన సినిమాలకన్నా అల్లు అర్జున్ సినిమాలకు ఇంకా మంచి పాటలు ఇచ్చారన్నారు. అయినా తాను మాత్రం అంతగా ఫీలవను అని వ్యాఖ్యానించారు.

ఆర్య2 బ్లాక్ బస్టర్ అవుతుందని, అలాగే హీరోయిన్ కాజల్ తో ఈమధ్యే తాను పనిచేశానని చెప్పారు. డార్లింగ్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం చెబుతుండగా మధ్యలో అల్లు అర్జున్ మైక్ తీసుకొని కాజల్ ను మర్చిపోతారా? అన్నట్లుగా వెరైనీ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ మాట్లాడాడు. అయితే ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదని, బన్నీ చెప్పేదంతా అబద్ధమని, కాజల్ చాలా హార్డ్ వర్క్ చేస్తుందని ప్రభాస్ చెప్పారు. సినిమా గురించి చెప్పడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ అక్కడున్న ప్రేక్షకులంతా ఎవరికివారే ప్రభాస్ కు హీరోయిన్ కాజల్ కు మధ్య సంథింగ్ ఏదో నడుస్తోందంటూ అరుపులతో గోలగోల చేశారు. దాంతో ఏమీ మాట్లాడకుండా ప్రభాస్ స్టేజ్ దిగి కిందకు వచ్చేశారు.












Click it and Unblock the Notifications