అల్లు అర్జున్ కొత్త ఇల్లు... తెలుగు ఇండస్ట్రీలోనే నభూతో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా చాలా విభిన్నంగా చేస్తారు. అందులో ఒక స్టైల్ ఉంటుంది. అందుకే ఐకాన్ స్టార్ కు ముందు బన్నీని స్టైలిష్ స్టార్ అనేవారు. చేసే ప్రతి పనిలోను భిన్నత్వాన్ని కోరుకునే అల్లు అర్జున్ తన ఇంటి విషయంలో కూడా అలాగే ఆలోచిస్తున్నారు. పుష్ప2 డిసెంబరు ఆరోతేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీకి ముందే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటగిరిలో రూ.100 కోట్ల వ్యయంతో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు.

ఇంటితోపాటు కార్యాలయం కూడా
కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో తన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. మూడువేల చదరపు అడుగుల వైశాల్యంలో అత్యంత విలాసవంతంగా, అత్యంత ఖరీదైన హంగులను అమర్చబోతున్నారు. దాదాపు ఈ ఇంటికి సంబంధించి అరవై శాతం పనులు పూర్తయ్యాయి. భార్య స్నేహారెడ్డితో కలిసి గృహప్రవేశం చేయనున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఖరీదైన ఇంటిగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి రూ.100 కోట్ల వ్యయంతో ఇల్లు నిర్మిస్తున్నప్పటికీ అన్ని హంగులు పూర్తిచేసుకునేసరికి దీని వ్యయం రూ.200 కోట్లుగా తేలుతుందంటున్నారు.

icon star allu arjun will construct new house in jubilee hills venkatagiri

కృష్ణంరాజు ఇంటికి సమీపంలోనే
రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంటికి సమీపంలోనే ఈ ఇల్లు నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ ఇంటికి మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం కూడా ఈ ఇంటి పక్కనే ఉంటుంది. అల్లు అర్జున్ ఇంటిదగ్గరకు వచ్చిన తన అభిమానులను కలవాలంటే బయటే కలవాల్సి ఉండేది. ఇప్పుడు వారిని కలుసుకోవడం, వారితో మాట్లాడటం కోసం ప్రత్యేకంగా పెద్దది ఒక గదిని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా తన సోషల్ మీడియా సైన్యం అల్లు అర్జున్ ఆర్మీకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కొత్త ఇంటిలో చాలా సౌకర్యాలను కల్పిస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఎంతో విభిన్నంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు అల్లు అర్జున్. డిసెంబరు ఆరున పుష్ప2 విడుదలైన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ లేదంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+