కల్కి ఆలోచన అక్కడినుంచే వచ్చింది : దర్శకుడు నాగ్ అశ్విన్
గత కొన్నిరోజులుగా సినీ ప్రపంచంలో వినిపిస్తోన్న పేరు కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక, ఈ చిత్రం విడుదలయిన కొద్దిరోజుల్లోనే కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ సినిమా ఇప్పటికే రూ.1000కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇక, ఈ తరుణంలో సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ తన విజయానికి గల కారణాలతో పాటు తన స్పూర్తి ఏంటో కూడా చెప్పారు. కల్కి సినిమా ఆలోచన ఎలా వచ్చిందో కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. అదేంటో ఆయన మాటల్లోనే విందాం..చాలామంది వారి వారి జీవితాల్లో ఎవరినో ఒకరిని ఇన్సిపిరేషన్‌గా తీసుకుంటారు. తాము చేసే, చేస్తున్న పనుల్లోనూ ఎవరిదో ఒకరి ప్రభావం ఉండకనే ఉంటుంది. అయితే నా విషయంలో మాత్రం అది పూర్తిగా భిన్నమనే చెప్పుకోవాలి.

ఎందుకంటే, నాకు స్ఫూర్తినిచ్చింది వ్యక్తులు కాదు. నాకు ఎంతో ఇష్టమైన సినిమాలు. నాకు స్పూర్తినిచ్చింది సినిమాలే. 'మాయాబజార్', 'భైరవ ద్వీపం', 'పాతాళభైరవి', 'స్టార్ వార్స్', 'మార్వెల్ సిరీస్ వంటి సినిమాలే నాకు స్పూర్తి. ఈ సినిమాలు ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకువెళ్తాయి. అలాగే ఈ స్టోరీలు విన్నా, చూసినా కానీ, మన కళ్ల ఎదుట మరో ప్రపంచం ఉంటుంది. ఈ చిత్రాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నేను కూడా ఇలాంటి చిత్రాలే తీయాలనే స్ఫూర్తిని నాలో నింపాయి.
ఒక విధంగా చెప్పాలంటే కల్కి సినిమా ఆలోచన కూడా నాకు అక్కడ్నుంచి వచ్చిందే. కథతోపాటు సినిమాలో కొత్త కొత్త ప్రాంతాల ఆలోచనకు కూడా నాకు ఈ చిత్రాలే ఒక రకమైన కారణమని చెప్పుకోవాలి. అంటూ నాగ్ అశ్విన్ తనకు సినిమాలపై ఉన్న అభిమానం గురించి చెప్పుకొచ్చారు. ఇక, ఈ సినిమాలో ప్రభాస్ వంటి స్టార్స్‌తో మరెందరో స్టార్స్ కూడా ఉన్నారు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకుణే, దిశాపటాని వంటి బాలీవుడ్ స్టార్స్ ఎందరో నటించారు.












Click it and Unblock the Notifications