తెలుగు స్టార్ హీరోయిన్ ప్రైవేట్ ఫొటోలు లీక్
ఇప్పుడైతే రోజుకో హీరోయిన్ టాప్ ప్లేస్‌లో ఉంటున్నారు కానీ, ఒకనొక సమయంలో ఇలియానా దశాబ్ద కాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ హీరోగా నటించిన 'దేవదాసు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రెండో సినిమానే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్‌తో నటించే అవకాశం దక్కించుకుంది. 'పోకిరి' సినిమాతో ఇలియానా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.
ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, ప్రభాస్ , అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. ఇలియానా పేరు చెప్పగానే అందరికీ ఆమె నడుమే గుర్తుకు వస్తుంది. ఎవరినైనా పొగిడే సమయంలో అచ్చం నీ నడుము ఇలియానాలా ఉందని ఉంటారు. అంత ఫేమస్ అయింది ఇలియానా నడుము. కోటి రూపాయిలు పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్‌గా ఇలియానా చరిత్ర సృష్టించింది. అంతలా ఆమె క్రేజ్ ఉండేది.

అయితే ఇలియానా నటించిన సినిమాలు ఫెయిల్ కావడం, ఇదే సమయంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో ఇలియానాకు ఆఫర్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ బాటబట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ పెద్దగా సక్సెస్ కావడంతో అమ్మడు సైలెంట్ అయింది. ఇదే సమయంలో ఇలియానా తన ప్రియుడితో గర్భవతి కావడంతో సినిమాలకు దూరంగా ఉంటుంది.
ఇదిలా ఉంటే ఇలియానాకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇలియానా బికినీ ఫొటోలు ట్విట్టర్(X)లో వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్ టూ పీస్ బికినీతో కూడిన ఇలియానా ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూస్తుంటే ఇలియానా గతంలో దిగిన ఫొటోలుగా అర్ధం అవుతున్నాయి. అసలు ఈ ఫొటోలు ఇప్పుడు ఎందుకు వైరల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఇలియానా బికినీతో మరోసారి కనిపించడంతో అభిమానులకు కనువిందుగా మారింది.












Click it and Unblock the Notifications