బాధతో గుండె బరువెక్కింది అంటున్న ఇలియానా...
దక్షిణాది సినిమాలో పెద్ద పెద్ద హీరోలతో నటించి, అతి తక్కువ సమయంలోనే గొప్ప నటిగా పేరు సంపాదించుకుంది ఇలియానా. ఆ తర్వాత తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సినిమాలు తీసింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ కూడా పెద్ద పెద్ద స్టార్‌లతో నటించింది. అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్‌లతో నటించింది.
అయితే, గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది ఇలియానా. అప్పటి నుంచి సోషల్‌మీడియాలో బాగా యాక్టివ్‌గానే కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఇలియానా సోషల్‌మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. బాధతో నా గుండె బరువెక్కింది...అంటూ ఎంతో ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు ఇలియానా. ఇంతకీ ఇలియానా ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారో తెలుసుకుందాం పదండి.

దేవదాసు సినిమాతో ఆరంగ్రేటం..
దక్షిణాదిలో దేవదాసు సినిమాతో ఇలియానా సినీ ప్రస్థానం మొదలయ్యింది. ఆ సినిమాలో రామ్‌పోతినేని సరసన హీరోయిన్‌గా తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సినిమా అప్పట్లో భారీ విజయాన్నే సొంతం చేసుకుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది ఇలియానా. మహేష్‌బాబుతో నటించిన పోకిరి సినిమా ఎంత హిట్టయిందో అందరికి తెలుసు.
ఇప్పటికీ ఆ సినిమా టీవిలో వస్తే టీవికి అతుక్కుపోయే వారే ఎక్కువ. ఆ తర్వాత జూనియర్ ఎన్‌టిఆర్‌తో రాఖీ సినిమాలో నటించారు. అందులో ఇలియానా ఓ రిపోర్టర్‌గా నటించి అందరిని మెప్పించారు.
ఇలియానా ఎమోషన్‌ల్ పోస్ట్..
ఇలియానా పర్సనల్ లైఫ్‌లోకి వస్తే ప్రేమ, బ్రేకప్, పెళ్లి అన్ని త్వరగానే జరిగిపోయాయి. పెళ్లయాక మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా అభిమానుల్లో ఆశించినంత ఫలితాలను పొందలేదు. ఎప్పడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ఇలియానా. ఆమె తన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, ఈ మధ్యకాలంలో తను ప్రెగ్నంట్‌గా ఉన్న ఫోటోలను కూడా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత తన బిడ్డ ఫోటోలు కూడా అభిమానులకు చూపించారు.
ప్రస్తుతం ఇలియానా తన మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో తన బిడ్డ అనారోగ్యానికి గురయ్యిందనే వార్త అభిమానులతో పంచుకున్నారు. రెండు నెలలు పూర్తయిన తన బిడ్డ అనారోగ్యానికి గురవ్వడం, తనకు ఎంతో బాధ కలిగిస్తుందని, ఆ బాధతో గుండె బరువెక్కిందని, ఆ బాధను ఎలా తట్టుకోవాలో తెలియడం లేదని వాపోయింది. ఆ బాధతో తన గుండె బరువెక్కిందని ఆ సమయంలో ఆమె ప్రియుడు చాలా దైర్యం ఇచ్చాడని తెలిపింది. అతను పక్కనుంటే ఎంతో సంతోషంగా ఉంటానని సోషల్‌మీడియా వేదికగా తన మనసులోని మాటలను, భావాలను ఇలా వ్యక్త పరిచింది ఇలియానా.












Click it and Unblock the Notifications