ఈ జీబ్రాల మధ్యలో దాగి ఉన్న జంతువు ఏదో కనిపెట్టగలరా..?
ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్, బ్రెయిన్ టీజర్లు మెదడుకు అద్భుతమైన వ్యాయామంలాంటివి. ఇవి మన ఆలోచనా శక్తిని పదును పెడతాయి, అలాగే నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను వేగంగా విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్ని వయసుల వారికీ సరిపోయే ఈ పజిల్స్‌ను తరచూ సాధన చేయడం వల్ల పరిశీలనా శక్తి, ఫోకస్, జ్ఞాపకశక్తి మరింత బలపడతాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్ వైరల్‌గా మారింది. అడవిలో నడుస్తున్న జీబ్రాల గుంపు చిత్రంలో, ఒక పులి అత్యంత చాకచక్యంగా దాగి ఉంది. జీబ్రాల నల్ల-తెలుపు గీతల మధ్య పులి ఆకారం కలిసిపోవడంతో, తొందరగా చూస్తే కనిపించదు. జాగ్రత్తగా, ఏకాగ్రతతో గమనిస్తేనే పులి ఆచూకీ బయటపడుతుంది.

అసలు ఛాలెంజ్ ఇదే..
ఈ పజిల్‌లో అసలు సవాల్ ఏమిటంటే కేవలం 8 సెకన్లలోపు పులిని గుర్తించగలగడం. ఇంత తక్కువ సమయంలో పులిని కనిపెట్టడం అంటే మీ కళ్ల పరిశీలనా శక్తి, మెదడు స్పందన వేగం చాలా బాగున్నాయనే అర్థం. 8 సెకన్లలో పులిని గుర్తించిన వారందరికీ నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ ఛాలెంజ్‌ని ట్రై చేసినవారిలో చాలా తక్కువ మంది మాత్రమే నిర్ణీత సమయంలో పులిని కనుగొనగలిగారు. మిగతావారు మళ్లీ మళ్లీ చిత్రాన్ని పరిశీలించాల్సి వచ్చింది.
అయితే మీరు ఇప్పటికీ పులిని కనుగొనలేకపోతే, ఎలాంటి నిరాశ అవసరం లేదు. ఇలాంటి పజిల్స్‌లో విజయం సాధించాలంటే అభ్యాసమే కీలకం. సాధారణంగా జీబ్రాల ముఖాలు, గీతల మధ్య ఉన్న అసమాన ఆకారాలను గమనిస్తే పులి తల లేదా శరీర ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్‌కు ఆదరణ పెరగడానికి కారణం.. మెదడుకు రిలాక్సేషన్ ఇవ్వడం, స్ట్రెస్ తగ్గించడం, ఏకాగ్రతను పెంచడం.. వినోదంతో పాటు మేధస్సును పరీక్షించడం వంటివి ఉపకరిస్తాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ఆసక్తిగా ట్రై చేస్తున్నారు.












Click it and Unblock the Notifications