"బాయిలోనే బల్లి పలికే "సింగర్ నాగవ్వ గురించి ఈ విషయాలు తెలుసా..?
చిత్ర పరిశ్రమలో ఫోక్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సింగర్ " మంగ్లీ ". కేవలం సినిమా పాటల తోనే కాకుండా ప్రైవేట్ అల్భమ్ సాంగ్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు పొందింది. ఇప్పటికే ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన ఈమె.. రీసెంట్ గానే "బావిలోనే బల్లిపలికే" పాటను రిలీజ్ చేసింది. ఈ పాటకు కమల్ స్లావత్ లిరిక్స్ అందించగా.. సురేష్ బబ్లీ సంగీతం సమకూర్చారు. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో ఈ సాంగ్ దూసుకుపోవడమే కాకుండా.. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది.
అయితే ఈ పాటతో తన గాత్రం లోని టాలెంట్ ని నిరూపించుకుంది సింగర్ చుంచు నాగవ్వ. మంగ్లీతో కలిసి ఆమె పాడిన ఈ పాట లక్షల మందిని నచ్చేయడమే కాకుండా.. చిన్నా, పెద్ద అందరూ స్టెప్పులేస్తున్నారు. ఒక్క పాటతోనే బాగా పాపులర్ అయిన ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవ్వ తన జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఆమె ఏమన్నారంటే..?
కాగా జగిత్యాల జిల్లాలోని గుల్లకోట గ్రామానికి చెందిన నాగవ్వ మొదట సారంగ దరియా అనే టీవీ షోలో పాల్గొన్నానని తెలిపారు. కానీ అప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ భయం కారణంగా ఆమె మొదటి ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ చేశారని వాపోయారు. అయినప్పటికీ న్యాయనిర్ణేతలు తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారన్నారు. వారి కారణం గానే దామోదర్ రెడ్డి, మంగ్లీలతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. రాక్షస కావ్యం అనే సినిమా కోసం ఈ పాట చేశామని.. కానీ మూవీలో కుదరకపోవడంతో మంగ్లీ టీమ్ రిలీజ్ చేశారని ఓపెన్ అయ్యారు. మంగ్లీ టీమ్ ఖర్చుకు వెనుకాడకుండా.. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఈ పాటను మూడు రోజుల్లో చిత్రీకరించారని స్పష్టం చేశారు.
అలానే గతంలో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వంటి సల్మాన్ ఖాన్ చిత్రంలోనూ నాగవ్వ బతుకమ్మ పాట పడినట్టు చెప్పుకొచ్చారు. ఈ పాట కోసం మంగ్లీ టీమ్ దాదాపు 15 లక్షలకుపైగానే ఖర్చు చేసినట్లు సమాచారం. మరోవైపు ఇటీవల ఈ పాటపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయని తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరాఠీ పాట కాపీ అనే ఆరోపణలను ఆయన ఖండించారు. జనాలు నిజాలు తెలుసుకోకుండా ట్రోల్స్ చేయడం సరికాదని పేర్కొన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications