పవన్ కళ్యాణ్ "ఓజీ"లో క్లైమాక్స్ కి పూనకాలే.. ట్విస్ట్ అదే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో పడ్డారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నేతగా పేరు తెచ్చుకున్న పవన్.. నిర్మాతలను సైతం దృష్టిలో ఉంచుకొని.. ఇచ్చిన మాట మేరకు ప్రాజెక్టులను చకచకా ఫినిష్ చేసేస్తున్నారు. పవన్ నటిస్తున్న చిత్రాల్లో 'OG', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' ఉన్నాయి.
ఎన్నికల ముందు ఈ సినిమాల షూటింగ్‌లు పూర్తికాలేకపోయాయి. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ మళ్లీ తన సినిమాల షూటింగ్స్‌ను మొదలుపెట్టారు. ఇటీవలే ఆయన 'OG' మరియు 'హరిహర వీరమల్లు' చిత్రాల షూటింగ్‌లలో పాల్గొన్నారు. అయితే మధ్యలో పవన్ కుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో, పవన్ వెంటనే అక్కడకు వెళ్లి రెండు రోజులు అక్కడే గడిపి తిరిగి ఇండియాకు వచ్చారు. ఈ కారణంగా కొంతకాలం షూటింగ్‌కు బ్రేక్ పడింది.

ఇప్పుడు తిరిగి మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొంటూ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి తన పాత్ర పూర్తి చేశారు. అలాగే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాలో కూడా తాను పాల్గొంటున్నారు. OG సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తిచేసి దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. పవన్ తన డేట్స్‌ను స్పెషల్‌గా కేటాయిస్తూ సినిమాను త్వరగా ముగించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్టు సమాచారం.
ఇక OG సినిమా కథ విషయానికి వస్తే.. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతున్న సినిమాగా తెలుస్తోంది. పవన్ పాత్రలో ఎన్నో మలుపులు, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డైరెక్షన్ ఉండబోతున్నాయట. సుజిత్ కూడా 'సాహో' సినిమా తర్వాత ఒక బలమైన కంబ్యాక్ ఇవ్వాలనే నమ్మకంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ ట్విస్ట్ లీక్ అయ్యిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
అదిరిపోయే ట్విస్ట్..
గతంలో కూడా ఇలాంటి ట్విస్ట్ కొన్ని సినిమాల్లో వచ్చినా, OG సినిమాలో ఈ ఎపిసోడ్‌ను చాలా ఎమోషనల్‌గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. థియేటర్లలో ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశముందని అంటున్నారు. మరి ఓజీ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టి.. ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications