ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ??

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందు గుర్తొచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా గ్లోబల్ లెవెల్ లో ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా సరే మొదటి రోజు వంద కోట్ల కలెక్షన్స్‌ వసూలు చేసే సత్తా ఆయన మూవీకే ఉందనడం అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. దేశవ్యాప్తంగానే కాకుండా యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు.

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా "రాజాసాబ్" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న మూవీ 'స్పిరిట్'. పాన్‌ వరల్డ్‌ టార్గెట్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ భాషల్లో రూపొందించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

interesting-details-about-prabhas-daily-food-cost-and-diet-secrets-also-food-menu-full-details

హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " హీరోయిన్ గా నటిస్తుంది. అలానే వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. అలానే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే మరో సినిమా కూడా చేస్తూ బిజీగా ఉన్నారు.

అయితే ఇంత బిజీ షెడ్యూల్స్ లలో కూడా ప్రభాస్ ఫిట్‌గా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. దాంతో ఆయన డైట్ రహస్యం ఏంటి అనే విషయాలు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ పెద్దమ్మ, దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ప్రభాస్ ఆహారపు అలవాట్ల గురించి ఆమె మాట్లాడుతూ.. కృష్ణంరాజు లానే ప్రభాస్ కూడా భోజన ప్రియులని వ్యాఖ్యానించారు.

తన చుట్టూ ఉన్న వారికి కూడా భోజనం పెట్టడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని.. ముఖ్యంగా షూటింగ్ సెట్‌లో పది, ఇరవై మందికి పైగా సిబ్బందితో కలిసి ఆయన భోజనం పంచుకుంటారని తెలిపారు. అందుకే ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఒక వంట బృందం ఉందని.. వారు రోజుకు సుమారు రూ.2 లక్షల విలువైన ఆహారాన్ని సిద్ధం చేసి సెట్‌లో అందరికీ వడ్డిస్తారని తెలిపారు. చేపలు, రొయ్యలు, చికెన్, మటన్, పీతలు వంటివి ప్రభాస్ మెనూలో ప్రధానంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చేపల పులుసు అంటే కృష్ణంరాజుతో పాటు ప్రభాస్‌కు కూడా ఎంతో ఇష్టమని వెల్లడించారు.

ఇక ప్రభాస్ తన సినిమాలో పని చేసే నటీనటుల కోసం కూడా ఫుడ్ పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సదరు ఫోటోలను సైతం పలువురు హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అలానే పలు ఇంటర్వ్యూలలో సైతం ప్రభాస్ పంపించే ఫుడ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+