బాలీవుడ్‌లో ఛాన్స్ కొట్టేసిన తెలుగు అమ్మాయి 'అనన్య నాగళ్ల'
చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిల హవా మళ్లీ మొదలవుతోంది అనిపిస్తుంది. ఇప్పటికే పలువురు తెలుగు నటీమణులు తెలుగుతో పాటు పలు భాషల్లో రాణిస్తున్న తరుణంలో మరో తెలుగు అమ్మాయి ఇప్పుడు బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసింది. 'షాదీ' అనే వెబ్ సిరీస్ తో నటిగా కేరీర్ ప్రారంభించి.. 'మల్లేశం' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. మొదటి సినిమాతోనే తనదైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకొని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తంత్ర, పొట్టేల్, బహిష్కరణ (వెబ్ సిరీస్), శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి మూవీల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. 'తంత్ర' హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్ లో టాప్ 2 లో ట్రెండ్ అవుతూ ఉండగా.. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో లో దేశ వ్యాప్తంగా ఇప్పటికీ టాప్ 5 లో ట్రెండ్ అవుతుంది. దీంతో తెలుగుతో పాటు పలు భాషల్లో సైతం మంచి ఫేమ్ దక్కించుకోగలుగుతుంది అనన్య.

ఆమె నటించిన చిత్రాలు అన్నీ వరుసగా మంచి టాక్ తెచ్చుకుంటుండడంతో నిర్మాతలు సైతం ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందించే లేడీ ఓరియెంటెడ్ మూవీలకు అనన్య బెస్ట్ ఆప్షన్ అని ఫిక్స్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ తెలుగమ్మాయి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ హిందీ ప్రాజెక్టులో లీడ్ రోల్ ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తోంది.
దీంతో ఇప్పటికే పలువురు హీరోయిన్లు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి సత్తా చాటారు. ఇక ఈ ముద్దుగుమ్మ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నారు. అలానే తెలుగులోనూ పలు సినిమాలతో బిజీగా ఉంది అనన్య. సినిమాలతో పాటు సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.












Click it and Unblock the Notifications