సమంత-నాగ చైతన్య మధ్య బయడపడ్డ మరో వ్యవహారం
సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసిందే. సమంత తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆ తరువాత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సమంత , నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. అటు నాగ చైతన్య కూడా సింగిల్‌గానే ఉంటున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్య కారణంగా సమంత పెద్దగా సినిమాలు చేయడం లేదు. అటు నాగ చైతన్య మాత్రం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తాజాగా సమంత, నాగ చైతన్యల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీరు లవ్‌లో ఉన్నప్పుడు అందరి ప్రేమికుల మాదిరిగానే అలకలు, గొడవలు, సారీలు వీరి మధ్య ఉండేవట. ఒకసారి ఓ విషయంలో నాగ చైతన్యతో సమంత మీద గట్టిగానే వాగ్వాదానికి దిగిందట. దీంతో కొన్ని రోజులు ఇద్దరి మధ్య మాటల్లేవట. చైతు మాట్లాడానికి ట్రై చేసినప్పటికీ సమంత అతన్ని దూరం పెట్టిందట.
అది నచ్చిన చైతన్య సమంతకు మెసేజ్ చేస్తూ...ఇప్పుడు నువ్వు కాల్ చేసి మాట్లాడకపోతే మన ప్రేమ విషయాన్ని అందరికి చెప్పేస్తానంటూ బెదిరించాడట. దీంతో భయపడిన సమంత ..ఎవరికి చెప్పకు నేను మాట్లాడుతానంటూ కాల్ చేసేదట. అలా వీరి మధ్య లవ్ ట్రాక్ గట్టిగానే నడిచినట్టుగా తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications