నాగ చైతన్యను బెదిరించిన సమంత..మ్యాటర్ మొత్తం లీక్
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

విడాకులు తీసుకున్న తరువాత ఈ జంట నేరుగా కలిసింది లేదు. కానీ తాజాగా వీరిద్దరు కలిసి ఒకే వేదికపై దర్శనం ఇచ్చారు. అమెజాన్ ప్రైమ్ ముంబై వేదికగా ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించింది. సమంత ,నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ప్రమోషన్ ఈవెంట్‌లో భాగమయ్యారు. ఇదిలా ఉంటే సమంత , నాగ చైతన్యల ప్రేమ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరి మధ్య లవ్ ట్రాక్ కొన్నాళ్లు నడిచిన తరువాత సమంత నాగ చైతన్యతో ప్రేమ విషయాన్ని తన కుటంబ సభ్యులకు చెప్పి ఒప్పించిందట.
ఇదే విషయాన్ని నాగ చైతన్యను కూడా వారి ఇంట్లో చెప్పమంటే ఆయన భయంతో చెప్పలేదట. ఇలాగే కొన్ని రోజులు గడిచినప్పటికీ ఇంట్లో చెప్పకపోవడంతో విరక్తి చెందిన సమంత..మనం ప్రేమించుకున్న విషయాన్ని మీ ఇంట్లో చెప్పకపోతే నేను నీకు రాఖీ కడతానని బెదిరించిందట. దీంతో సమంత తనకు ఎక్కడ రాఖీ కడుతుందో అని భయంతో సమంతతో ప్రేమ వ్యవహారాన్ని చైతు తన ఇంట్లో లీక్ చేశాడట. ఆ తరువాత నాగార్జున సైతం సమంత, నాగ చైతన్యల ప్రేమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం నాగ చైతన్యను సమంత బెదిరించిందనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications