Sania Mirza : సానియా మీర్జా విడాకుల వెనుక ఆ తెలుగు హీరో..?
Sania Mirza : టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసింది. సానియా మీర్జా తన 15 ఏళ్ల దాపంత్య జీవితానికి గుడ్ చెప్పింది. భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో .. అతనితో సానియా మీర్జా బంధం తెగిపోయినట్టు అయింది. షోయబ్ మాలిక్ పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.
సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ ఎఫైర్ పెట్టుకున్నాడని..ఆ కారణంగానే సానియా మీర్జాతో అతను దూరంగా ఉంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ సనా జావేద్‌ను షోయబ్ పెళ్లాడాడు. ఇదిలా ఉంటే సానియా మీర్జా - షోయబ్ మాలిక్ విడాకులపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడానికి షోయబ్‌కు సిగ్గు లేదని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరి కొందరు పాకిస్థాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఇలాగే జరగాలంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పెళ్లి తరువాత సానియా మీర్జా పాకిస్థాన్‌లో కన్నా ఇండియాలో ఎక్కువుగా కనిపించినప్పుడే సానియా జంట విడిపోవడం ఖాయమని భావించామని మరి కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటారు.
సానియా మీర్జా విడాకుల సమయంలో సానియా మీర్జాకు సంబంధించిన ఓ వార్త తెర మీదకు వచ్చింది. షోయబ్ మాలిక్ మాదిరిగానే సానియా మీర్జా ఓ హీరోతో ఎఫైర్ ఉందనే చాలాకాలం క్రితం పుకార్లు షికార్లు చేశారు. ఓ ప్రముఖ తెలుగు హీరోతో సానియా మీర్జా రిలేషన్‌లో ఉందనే వార్తలు అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి. దానికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి చాలా ఈవెంట్స్‌లో దర్శనం ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వార్తలపై అటు సానియా కాని .. ఇటు ఆ స్టార్ హీరో కాని స్పందించింది లేదు. ఇక బాలీవుడ్ హీరో , హీరోయిన్లతో కూడా సానియాకు మంచి సంబంధాలే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్స్ చేసుకున్న పార్టీల్లో అప్పుడప్పుడు సానియా తలుక్కున మెరిసేది. ఏది ఏమైనప్పటికీ సానియా మీర్జా విడాకులపై ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications