బిగ్ బాస్ లోకి WWE లెజెండ్ 'అండర్ టేకర్'.. మైక్ టైసన్ కూడా !
దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షో అంటే బిగ్ బాస్ అనే చెప్పాలి. ఈ రియాలిటీ షో కి కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. ఈ షో ఇప్పటికే హిందీలో 18 సీజన్లో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని సరికొత్త సీజన్‌తో మళ్లీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈసారి కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ 'బిగ్‌బాస్ 19' నిన్న (ఆగస్టు 24, ఆదివారం) రాత్రి అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఈసారి 'Gharwalon Ki Sarkaar' అనే థీమ్.. ఇంటి సభ్యులే తమ నిర్ణయాలతో నడిపించే కాన్సెప్ట్ తీసుకువచ్చారు.

అయితే ఈ సీజన్ ప్రారంభం లోనే ఒక సంచలన వార్తతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అంతర్జాతీయ స్టార్స్ అడుగుపెట్టనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మైక్ టైసన్, అండర్‌టేకర్ రాక!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రపంచ ప్రఖ్యాత మాజీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా రానున్నారు. ఆయన రాక దాదాపు 60 శాతం ఖాయమైందని, తుది ఒప్పందం పూర్తయితే షోలో ఆయన సందడి ఖాయమని సమాచారం.
అంతేకాకుండా, డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) లెజెండ్, 'ది అండర్‌టేకర్' కూడా నవంబర్ నెలలో ఒక వారం పాటు ప్రత్యేక అతిథిగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే భారత టెలివిజన్ చరిత్రలోనే ఇది ఒక పెద్ద సంచలనం అవుతుంది.

రికార్డు నిడివి & కొత్త హోస్ట్‌లు
అలానే ఈ సీజన్ బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యధిక కాలం నడిచే సీజన్‌గా రికార్డు సృష్టించనుంది. ఏకంగా ఐదు నెలల పాటు ఈ షో ప్రసారం కానుంది. తొలి మూడు నెలలు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించి, ఆ తర్వాత గ్రాండ్ ఫినాలేకి తిరిగి వస్తారు. మధ్యలో మిగిలిన రెండు నెలల పాటు ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, సీనియర్ నటుడు అనిల్ కపూర్ హోస్టులుగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications