ప్రభాస్‌ హీరోయిన్ భలే పని చేసిందే..!

బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న హీరోయిన్ల పేర్లలో కృతి సనన్ కూడా ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాతో కృతి సనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఆ తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ సినిమా ఫలితం కూడా కృతి సనన్‌ను నిరాశ పర్చింది.

దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌కు మకాం మార్చింది. తెలుగులో ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర తెచ్చుకున్న కృతి సనన్, బాలీవుడ్‌లో మాత్రం బాలీవుడ్‌ మాత్రం సత్తా చాటారు. బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో సీతగా కనిపించి అభిమానులను అలరించింది. ఇదిలా ఉంటే కృతి సనన్ వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. హీరోయిన్ కృతి సనన్‌తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి. షూటింగ్‌లో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారిందనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఆదిపురుష్ తరువాత వీరిద్దరు క్లోజ్‌గా మూవ్ కావడంతో వీరు ప్రేమ నిజమే అని అనుకున్నారంతా.

Is Kabir Bahia the new love of Kriti Sanon

కృతి సనన్‌తో ప్రేమ వ్యవహారం గురించి ప్రభాస్‌నే స్వయంగా ప్రశ్నించారు బాలకృష్ణ. తన అన్‌స్టాప్‌బుల్ షోకు గెస్ట్‌గా వచ్చిన ప్రభాస్‌ను కృతి సనన్‌తో ఎఫైర్ గురించి ప్రభాస్‌ను బాలకృష్ణ నేరుగానే ప్రశ్నించాడు. బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం దాటవేసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. అటు కృతి సనన్ మనస్సులో ఓ సౌత్ హీరోపై ఉన్నాడని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం ఓ షోలో చెప్పడం కూడా అప్పట్లో ప్రభాస్‌, కృతి సనన్‌ల బంధం గురించి బాలీవుడ్ మీడియాలో కూడా అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా వీరిందరికి షాకిస్తూ కృతి సనన్‌ మరోకరితో రిలేషన్‌లో ఉన్నట్టు సమాచారం అందుతోంది.

Is Kabir Bahia the new love of Kriti Sanon

లండన్‌‌కు చెందిన ఓ కోటీశ్వరుడి కొడుకు కబీర్ బహియా అనే వ్యక్తితో కృతి సనన్‌ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలు కూడా బయటకు రావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని అందరికి అర్థం అయింది. కృతి సనన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కబీర్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటో షేర్ చేయడంతో ప్రేమ వార్తలకు బలం చేకూరినట్టు అయింది. ''పుట్టినరోజు శుభకాంక్షలు కే. నీ చిరునవ్వు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను'' అనే క్యాప్షన్ జత చేస్తూ రెడ్ హార్ట్ సింబల్‌ను షేర్ చేసింది. త్వరలోనే కృతి సనన్‌ కబీర్ బహియాను వివాహం చేసుకోవడానికి కూడా సిద్ధమవుతుందని తెలుస్తోంది. అది చూసిన వారంతా లవ్ గురించి హింట్ ఇచ్చిందని చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+