పరిణీతి చోప్రా వివాహానికి ప్రియాంక చోప్రా డుమ్మా కొట్టనుందా..?
బాలీవుడ్ నటీ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాల వివాహం బీ టౌన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పరిణీతి చోప్రా పెళ్లికూతురుగా మారుతుందన్న క్రేజ్ అభిమానుల అందరి నోళ్లలో నానుతోంది. నటి వివాహానికి ఒక్కొక్కరుగా అతిథులు ఉదయపూర్‌కు చేరుకుంటున్నారు. వీటన్నింటి మధ్యలో ప్రియాంక చోప్రా ఈ వివాహానికి హాజరవుతారా? లేదా? అనే వార్త ఇప్పడు హాట్‌టాపిక్‌గా మారింది.
ఎందుకంటే, ఇప్పటికే చోప్రా, చద్దా కుటుంబాలన్నీ ఉదయపూర్‌కు చేరుకున్నాయి. మిగిలిన అతిథులు కూడా పెళ్లికి హాజరయ్యేందుకు ముందుగానే లీలా ప్యాలెస్‌కు చేరుకున్నారు. కానీ, ఇప్పటివరకు చేరుకోని ప్రియాంక చోప్రా వివాహానికి వస్తుందా? లేదా? అన్న విషయం అభిమానుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే ప్రియాంకా చోప్రా తల్లి మధు చోప్రా ఉదయపూర్‌కు వచ్చేసారు. సెప్టెంబర్ 24 ఆదివారం ఉదయం పది గంటలకు ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో పరిణీతి మరియు రాఘవ వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.

ఇప్పటికే నిశ్చితార్థానికి హాజరైన ప్రియాంక: ఇంతలో, ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్ తాను లాస్ ఏంజెల్స్‌లోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే, అవసరమైతే ప్రియాంకా ప్రత్యేక ఫ్లయిట్‌లోనైనా వివాహానికి హాజరయ్యే అవకాశాలు లేకపోలేదని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ప్రియాంక తన కుమార్తె మాల్తీతో కలిసి వివాహానికి రానుందని ఇప్పటికీ గట్టినమ్మకంతోనే ఉన్నాయి.
ప్రియాంక గతసారి భారత్ సందర్శించిన సమయంలో ఢిల్లీలో పరిణీతి నిశ్చితార్థానికి హాజరయ్యందని గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది మేలో పరిణీతి మరియు రాఘవ నిశ్చితార్థం జరిగినప్పుడు, ప్రియాంక సిటాడెల్ గ్లోబల్ ప్రమోషన్‌లకు కొంత సమయం కేటాయించి, నిశ్చితార్థం కోసం కేవలం ఒక రోజు ఇక్కడ హాజరైన విషయం తెలిసిందే. అయితే, పెళ్లికి రాకపోవచ్చన్న కారణంతోనే నిశ్చితార్థానికి హాజరైందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

కలిసి చదువుకున్నారు: ఇదిలా ఉంటే.. పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దా వివాహానికి బాలీవుడ్ తారలకంటే రాజకీయ ప్రముఖులే అతిథుల జాబితాలో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హాజరుకానున్నారు. మరోవైపు పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దా నిశ్చితార్థం చేసుకున్నంత వరకు తమ సంబంధాన్ని బయటపెట్టలేదు. అయితే, వీరిద్దరూ చాలా సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు.
అనేక వేడుకల్లోనూ ఈ జంట గతంలో సందడి చేసింది. ఇద్దరూ కలిసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలిసి చదువుకున్నారు. రేపు(సెప్టెంబర్ 24) వీరి వివాహం ఉదయపూర్ లోని లీలా ప్యాలస్‌లో ఎంతో ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఈ ప్యాలెస్‌ను అందంగా ముస్తాబు చేశారు. ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కూడా ముగిసింది. వధువుకు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రా మ్యారేజ్ డ్రెస్‌ను డిజైన్ చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications