దీపావళి అందం మొత్తం నీ దగ్గర ఉంది అమ్మడు
టాలీవుడ్‌లో గ్లామర్, టాలెంట్ కలగలిసిన కథానాయికలలో నభా నటేష్ ఒకరు. ఇంజనీరింగ్ వదిలి, మోడలింగ్, రంగస్థలం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ... తెలుగు ప్రేక్షకులకు 'నన్ను దోచుకుందువటే'తో పరిచయమైంది. అయితే, ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది మాత్రం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన 'ఇస్మార్ట్ శంకర్' (2019). ఆ సినిమాలోని 'చాందిని' పాత్రలో ఆమె చూపించిన ఎనర్జీ, గ్లామర్ ఆమెకు 'ఇస్మార్ట్ బ్యూటీ' అనే గుర్తింపును తెచ్చిపెట్టింది.
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత 'డిస్కో రాజా', 'మాస్ట్రో' వంటి పలు చిత్రాల్లో నటించినప్పటికీ, దురదృష్టవశాత్తు ఆ సినిమాలు ఆమె కెరీర్‌కు ఆశించినంతగా ఉపయోగపడలేదు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే జరిగిన యాక్సిడెంట్ ఆమెను కొంతకాలం ఇండస్ట్రీకి దూరం చేసింది. టాలెంట్ పుష్కలంగా ఉన్నా అదృష్టం దక్కడం లేదని సినీ వర్గాల్లో చర్చ నడుస్తున్న సమయంలోనే... ఆమె ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ్తో కలిసి 'స్వయంభూ' వంటి కొత్త ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకున్నారు.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం నభా నటేష్ తన ఫ్యాన్స్‌కు రెగ్యులర్‌గా ట్రీట్ ఇస్తుంటారు. తాజాగా, దీపావళి పండుగ సందర్భంగా ఆమె తన ఇంటి వద్ద జరిగిన సంబరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అందమైన సంప్రదాయ దుస్తుల్లో, దీపకాంతుల మధ్య మెరిసిపోతున్న నభా... ట్రెడిషనల్ వేర్‌లోనూ తనదైన గ్లామర్ డోస్‌ను అస్సలు తగ్గించలేదు. ఒకవైపు కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చుతూ, మరోవైపు తన లేటెస్ట్ గ్లామరస్ ఫోటోషూట్‌లను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అందించారు.
సినిమా అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నా, తన గ్లామర్ , సోషల్ మీడియా క్రేజ్‌తో నభా నటేష్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక రాబోయే 'స్వయంభూ' వంటి సినిమాలు ఆమెకు మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించి, ఈ 'ఇస్మార్ట్ బ్యూటీ'కి ఇండస్ట్రీలో మరింత అదృష్టాన్ని తెచ్చిపెడతాయేమో చూడాలి.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం!












Click it and Unblock the Notifications