అడ్డంగా దొరికిన 'పుష్ప2'... పెద్ద గోల్‌మాల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించిన భారీ చిత్రం పుష్ప2. గత డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం రూ.1850 కోట్లు వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. నార్త్ బెల్టులో దాదాపు రూ.వెయ్యి కోట్లు వచ్చినట్లు వెల్లడించింది. బాహుబలి2 రికార్డును బద్దలు కొట్టి త్వరలోనే దంగల్ మూవీ రికార్డును కూడా బద్దలు కొట్టబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. దంగల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.2వేలు కోట్లు వచ్చాయి. మరో రూ.150 పుష్ప2 సాధించగలిగితే దంగల్ రికార్డును బద్దలు కొడుతుందంటున్నారు.
మైత్రీ డిస్ట్రిబ్యూషన్ లెక్కల్లో తేడాలు
ఇటువంటి తరుణంలోనే ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్త్రతంగా దాడులు నిర్వహించారు. మైత్రీ మూవీస్, దిల్ రాజు, భైరవం నిర్మాత, సినిమాలకు ఫైనాన్స్ చేసే అభిషేక్ అగర్వాల్, రంగయ్యపై కూడా దాడులు జరిగాయి. పుష్ప2 ను నిర్మించిన మైత్రీ మూవీస్ కార్యాలయంకన్నా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రీ డిస్ట్రిబ్యూషన్ పైనే ఎక్కువగా దృష్టిసారించారు. సినిమా విడుదలకు ముందే రూ.వెయ్యి కోట్లు వచ్చాయని పుష్ప2 యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత కూడా కలెక్షన్లు ఎంత వచ్చాయో వరుసగా కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేసిన దాడుల్లో లెక్కలన్నీ తేడా వచ్చినట్లు తెలుస్తోంది.

చెబుతున్నవాటికి, వచ్చినవాటికి అసలు పొసగడంలేదు
ప్రకటించినవాటికి, చెబుతున్నవాటికి, వచ్చినవాటికి ఏమాత్రం పొసగడంలేదని తెలుస్తోంది. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలన్నీ చూస్తున్న శశిధర్ రెడ్డిని ప్రశ్నించారు. అతని కోసం శశిధర్ రెడ్డి మామకు చెందిన ఓ హోటల్ కు వెళ్లి మరీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నించినట్లు తెలుగు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా నిలిచింది. కట్టే పన్నుకు, జీఎస్టీకి కూడా అస్సలు సంబంధం లేకపోవడంతో కొన్ని కీలక పత్రాలను అధికారులు తీసుకువెళ్లినట్లు సమాచారం. దీనిపై పుష్ప2 నిర్మాతలు ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. దీనిపై వారు అధికారికంగా ప్రకటించేంతవరకు పుష్ప2 సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయనేది తెలుస్తుంది. అప్పటివరకు ఇంత వచ్చింది.. అంత వచ్చింది.. ఆ రికార్డును బద్దలు కొట్టం.. ఈ రికార్డును బద్దలు కొట్టామని మాట్లాడుకోవడమే.












Click it and Unblock the Notifications