ఆ పెద్దాయన పిలిచినప్పుడల్లా అతనితో పడుకోవాలి.. జబర్థస్త్ నటి సంచలనం
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా జబర్థస్త్ నటి తన్మయి తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. ట్రాన్స్ జెండర్‌గా గుర్తింపు తెచ్చుకుంది తన్మయి. చూడటానికి అమ్మాయిలాగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తన్మయి అందం ముందు అమ్మాయిలు కూడా పనికి రారు.

తన్మయి తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన చేదు ఘటనలను అభిమానులతో షేర్ చేసుకుంది. తనకు జబర్థస్త్ షో ద్వారా ఫేమస్ వచ్చిన తర్వాత చాలామంది నన్ను లైంగికంగా వేధించారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇండస్ఠ్రీలో పెద్ద మనిషిగా ఉన్న ఓ వ్యక్తి తనను చాలా ఇబ్బంది పెట్టారని తన్మయి తెలిపింది. తన కోరిక తీర్చకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని భయపెట్టారని వెల్లడించింది.
పిలిచినప్పుడల్లా అతనితో పడుకోవాలని లేదంటే తిట్టేవాడు, కొట్టేవాడని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో నాకు డబ్బులు అవసరం ఉండి, తప్పని సరిగా వాళ్లతో ఉండాల్సి వచ్చేదని బాధపడుతూ తన గోడును వెళ్లబోసుకుంది. ప్రస్తుతం నేను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని, నా కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే తన లక్ష్యమని తన్మయి ఈ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications