'ఛాయ్ చల్లారేలోపే పాలిటిక్స్ రంగులు మారుతున్నాయ్' ..అన్న
లెలిజాల రవీందర్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన "రాజు గాని సవాల్" చిత్రం రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న గ్రాండ్‌గా విడుదల కానుంది. రితికా చక్రవర్తి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా టీజర్‌ను వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు విడుదల చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ, ప్రేక్షకులు ఏమాత్రం నిరాశపడకుండా మంచి లోకల్ ఎలిమెంట్స్, సెంటిమెంట్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుందని హామీ ఇచ్చారు.

హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ, హైదరాబాద్ కల్చర్‌ను, తెలంగాణ ఫ్యామిలీ బాండింగ్‌ను ఈ సినిమాలో సహజంగా చూపించామని తెలిపారు. కవాడిగూడలోని రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ సినిమా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, ఎంటర్‌టైన్‌మెంట్‌తో మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుందని వివరించారు. నెగటివ్ షేడ్స్లో కీలక పాత్ర పోషించిన నటుడు రవీందర్ బొమ్మకంటి, అక్క పాత్రలో నటించిన పద్మ కూడా ఈ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు.
"రాజు గాని సవాల్" అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, ఘన విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications