ఓ ఇంటివాడైన 'జాలిరెడ్డి' ధనుంజయ్.. ఎవరితో అంటే ?
కన్నడ నటుడు డాలీ ధనంజయ.. హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్రలో నటించి ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. అలానే సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. అయితే తాజాగా ధన్యత అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకున్నారు. ఈరోజు మైసూరు వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరగనుంది. వివాహ వేడుకకు ముందు శనివారం రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కూడా రిసెప్షన్ వేడుకకు హాజరై కాబోయే జంటకు అభినందనలు తెలిపారు. వాళ ఉదయం జరిగిన ఈ పెళ్లి వేడుకకు కన్నడ సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం మైసూర్ ప్యాలెస్ ముందు ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఒక విలాసవంతమైన సెట్‌ను నిర్మించారు. పెళ్లికి అభిమానులు సైతం పెద్దఎత్తున పాల్గొన్నారు.

డాలీ ధనుంజయ్‌కు మైసూర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ప్రాథమిక విద్య, జీవితం, సినిమా పరిశ్రమలోకి ప్రవేశం అన్నీ మైసూర్‌లోనే జరిగాయి. అందుకే మైసూర్‌లోనే వివాహం చేసుకున్నారు. చాముండేశ్వరి దేవి ఆశీర్వాదం పొందడానికి చాముండేశ్వరి ఆలయ నమూనాతో పెళ్లి వేదికను నిర్మించారు. అలాగే టవర్ ఆకారపు సెట్ పెళ్లికి హైలైట్‌గా నిలిచింది. కాగా ధనంజయ్- ధన్యత గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.
ఇక పుష్ప 2 మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం రూ.1896 కోట్లు రాబట్టింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో సైతం రికార్డులు కొల్లగొడుతుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రీలోడెడ్ వర్షన్ ప్రకారం మూడు గంటల 44 నిమిషాల నిడివితో పుష్ప 2 ఓటీటీలో సందడి చేస్తోంది.
-
Ind Vs Eng: సెమీస్ లో స్టార్ బ్యాటర్ పై వేటు, డేంజెరస్ హిట్టర్ ఇన్ - మార్పుల వెనుక..!! -
హోలీ ఎప్పుడు? మార్చి 3 లేదా 4నా - స్కూల్స్.. బ్యాంకుల సెలవుపై తాజా నిర్ణయం..!! -
వారి రేషన్ కార్డులు రద్దు, జాబితా సిద్దం - అనూహ్య నిర్ణయం..!! -
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, వారికి కేటాయింపు - పంపిణీ ముహూర్తం..!! -
దుబాయ్ లో ఇరుక్కుపోయిన తెలంగాణా మంత్రి.. పరిస్థితి ఇలా! -
T20 World Cup 2026: పాక్ ఆటగాళ్లకు పీసీబీ భారీ జరిమానా! -
పాకిస్థాన్‌పై డ్రోన్ దాడి.. ఎయిర్‌బేస్ లక్ష్యంగా భీకర దాడులు! -
నాడు సంజూ పై సూర్య వెటకారం, ఇప్పుడు టోపీ తీసి సెల్యూట్..!! -
బంగారం ధరలు ముట్టుకుంటే భారీ షాక్.. స్కై రాకెట్ -
ఒకప్పుడు 41 మంది హీరోయిన్స్‌ని పరిచయం చేసిన తోపు హీరో.. కానీ !! -
నీ ఆస్తులు మొత్తం ఆమెకే రాసిచ్చావా ..! విజయ్ కంటే భార్యకే ఎక్కువ ఆస్తులు!! -
రేషన్ కార్డు దారులకు ఏపీ ప్రభుత్వం బిగ్ ఆఫర్ - ఇక ప్రతీ కుటుంబానికీ..!!












Click it and Unblock the Notifications