విజయ్ 'జన నాయకుడు' ట్రైలర్ వచ్చేసింది.. బాలయ్య సినిమాను దించేశారా.?
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమా 'జన నాయగన్' ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న విడుదల చేయనున్నారు. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విజయ్ కు ఇదే చివరి సినిమా. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ గతంలో ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ట్రైలర్ చూస్తే మాత్రం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి చిత్రం మాదిరిగానే ఉంది. విజయ్.. బాలయ్య చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారంటూ గతంలో చాలా కథనాలు వచ్చాయి. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే ఆ వార్తలు నిజమేనని తెలుస్తోంది. ఇదే విషయంపై ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడిని కొందరు అడగ్గా.. ఆయన క్లారిటీ ఇచ్చారు. వాళ్లు కూడా చాలా దాచి పెట్టి చెబుతున్నారని.. ఆ మూవీ డైరెక్టర్ కూడా ఇది విజయ్ సినిమా అని చెప్పారని అన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు దీన్ని అలాగే ట్రీట్ చేద్దామని.. ఇది దళపతి విజయ్ సినిమా అని అనిల్ రావిపూడి తెలిపారు.
ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నారు. వీరితో పాటు మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవల మలేసియాలో జన నాయగన్ ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.
-
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications