విజయ్ '69' టైటిల్ ఇదే.. చివరి సినిమాకు షాకింగ్ టైటిల్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమాపై అటు ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుడికి సైతం భారీ అంచనాలు ఉన్నాయి. గతేడాది 'గోట్​' మూవీతో సక్సెస్ అందుకున్నారు విజయ్. అంతకుముందు రిలీజైన లియో సినిమాతోనూ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం 'దళపతి 69' అనే వర్కింగ్ టైటిల్ ​తో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఈ మూవీని హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు 'జన నాయకన్' (జన నాయకుడు) అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. బాలీవుడ్ స్టార్ బాబీ దేఓల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ ​పై ఈ సినిమా రూపొందుతోంది.

Jana Nayakan Vijay s Latest Film Title Revealed

చివరి సినిమా ఇదే..!

గతేడాది దళపతి విజయ్ ​రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయమని, ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వమని గతంలోనే తెలిపారు. విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని చెప్పారు. 2026 లో ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆ కారణంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు పేర్కొన్నారు. దీంతో వినోద్ దర్శకత్వంలో చేసే జన నాయకన్ చిత్రమే విజయ్ ఆఖరి మూవీ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. టాక్ తో సంబంధం లేకుండా దళపతి విజయ్ ను చివరిసారి బిగ్ స్క్రీన్ పైన చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తెలుగు సినిమాలతో తారాస్థాయికి

దళపతి విజయ్ కు అంత స్టార్ డమ్ తీసుకొచ్చింది మాత్రం తెలుగు సినిమాలే అవును.. విజయ్‌ కెరీర్‌లో పోక్కిరి, గిల్లి, బద్రి, ఆది, వేలాయుధం, యూత్‌ వంటి సినిమాలు ముఖ్యమైనవి. ఈ సినిమాలు విజయ్ కెరీర్‌ను మలుపుతిప్పాయి. ఇవన్నీ తెలుగు సినిమాలే కావడం విశేషం. పవన్‌కల్యాణ్‌ను ఎక్కువగా అనుకరించేవారు. ఆయన పాటలు, సినిమాలను రీమేక్‌ చేశారు. దీంతో అక్కడ స్టార్ గా విజయ్ ఎదిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+