వీడియో విడుదల చేసిన జానీ మాస్టర్
Jani Master: బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్‌లో కలకలం రేపింది. కొందరు టాలీవుడ్ సెలెబ్రిటీలు పాల్గొన్నట్లు వచ్చిన వార్తలు దుమారం రేపాయి. హీరో శ్రీకాంత్, నటి హేమ పేర్లు సైతం వెలుగులోకి రాగా..దాన్ని వారు తోసిపుచ్చారు. తాము హైదరాబాద్‌లోనే ఉన్నామంటూ వివరణ ఇచ్చారు.
బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్లు జరుగుతున్న ప్రచారంపై టాలీవుడ్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. దీనిపై ఆయన ఓ స్పష్టత ఇచ్చారు. తాను బెంగళూరుకు వెళ్లలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

తెలుగు ఫిల్మ్, టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయం (టీఎఫ్టీడీడీఏ)లో ఆ వీడియోను తీశారాయన. తనకు కేటాయించిన ఛాంబర్‌నూ ఈ వీడియోలో చూపించారు. సీనియర్ కొరియోగ్రాఫర్, నటుడు దివంగత ముక్కు రాజు ఫొటోను ప్రింట్ చేసి ఉన్న బ్యానర్‌ను ఇందులో చిత్రీకరించారు.
తాను హైదరాబాద్‌లో యూనియన్ ఆఫీసులో ఉన్నానని వివరించారు జానీ మాస్టర్. బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొన్నానంటూ ప్రచారం జరుగుతోందని, అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. మొన్నటి వరకు ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని, ఆ సమయంలో కొన్ని పనులు ఆగిపోతే యూనియన్ ఆఫీస్‌లో అవి చూసుకుంటున్నానని చెప్పారు.
తన స్నేహితుల్లో కొందరికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించానని, వాళ్ల మంచీ చెడులను తాను చూసుకుంటున్నానని చెప్పారు. దీనికి సంబంధించిన రెండు ఫొటోలను జానీ మాస్టర్ ఈ వీడియోలో యాడ్ చేశారు. డైరెక్టర్స్ డే సందర్భంగా ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నానని, అక్కడ కూడా ఎంజాయ్ చేసొచ్చామని చెప్పారు.
హైదారాబాద్ లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని, జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు.
— Jani Master (@AlwaysJani) May 20, 2024
నిన్న డైరక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ కి, నేడు నా చిరకాల స్నేహితుడిని… pic.twitter.com/iCTccquFkN
అది ప్రోగ్రామ్ లైవ్ వచ్చిందని, చాలా మంది చూశారో లేదోనని జానీ మాస్టర్ అన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలను బయటికి తీసుకెళ్లడానికి కూడా తనకు టైమ్ ఉండట్లేదని, అలాంటిది నేను రేవ్ పార్టీకి వెళ్లానంటున్నారని పేర్కొన్నారు. ఇంట్లో పిల్లలకు చాక్లెట్ పార్టీ ఇవ్వడానికే టైమ్ దొరకట్లేదని చెప్పుకొచ్చారు.
-
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!!












Click it and Unblock the Notifications