ఈ వారం OTTలోని వచ్చే సినిమాలు, వెబ్​సిరీస్​లు ఇవే..

సంక్రాంతి సినిమాల ఊపు తగ్గింది. ఈ వారం పలు సినిమాలు థియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప- 2 మూవీ జనవరి 30న నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. విశాల్ నటించిన మదగజరాజు మూవీ జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. ఆ సినిమాల వివరాలు ఏంటో ఇక్కడ చూడండి.

వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ

వరుణ్‌ సందేశ్‌ కీలక పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'రాచరికం'. విజయ్‌ శంకర్‌, అప్సరా రాణి ఆయా పాత్రలు పోషించారు. సురేష్‌ లంకలపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 31న థియేటర్లలోకి రానుంది.

January 31st Movie Releases What to Watch in Theaters and On OTT

మహిష

వి.ప్రవీణ్, యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మహిష'. దర్శకుడు కె.వి. ప్రవీణ్ తెరకెక్కించారు. ఈ నెల 31న విడుదల కానుంది.

సూపర్ హిట్ థ్రిల్లర్ ఐడెంటిటీ..

మలయాళంలో సూపర్ హిట్​ అందుకున్న మిస్టరీ థ్రిల్లర్‌ 'ఐడెంటిటీ'. టొవినో థామస్‌, త్రిష లీడ్​ రోల్స్​లో అఖిల్‌ పాల్‌, అనాస్‌ఖాన్‌ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రమిది. జనవరి 24న తెలుగులో విడుదలైంది. అయితే థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక జీ5లో జనవరి 31వ తేదీ నుంచి తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

విశాల్ లేటెస్ట్ మూవీ

తమిళ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ 'మదగజరాజు'. ఈ సినిమా 2012లోనే షూటింగ్ పూర్తిచేసుకుంది. ఆ సమయంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల రిలీజ్ కాలేదు. తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీ జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. ఈ మూవీలో అంజలీ, వరలక్ష్మి శరత్​కుమార్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాకు సుందర్‌.సి దర్శకత్వం వహించారు.

ఓటీటీలోకే నేరుగా

పృథ్వీ, విస్మయ శ్రీ , శత్రు, ఆడుకాలం నరేన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'పోతుగడ్డ'. రక్ష వీరమ్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో జనవరి 30వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

నెట్‌ఫ్లిక్స్‌

పుష్ప- 2 (తెలుగు) జనవరి 30
లుక్కాస్‌ వరల్డ్‌ (హాలీవుడ్‌) జనవరి 31
ది స్నో గర్ల్‌2 (వెబ్‌సిరీస్‌) జనవరి 31

ఆపిల్‌ టీవీ ప్లస్‌

మిథిక్‌ క్వెస్ట్ (వెబ్‌సిరీస్‌) జనవరి 29

అమెజాన్‌ప్రైమ్‌

ర్యాంపేజ్‌ (హాలీవుడ్‌) జనవరి 26
ట్రెబ్యునల్‌ జస్టిస్‌2 (వెబ్‌సిరీస్‌) జనవరి 27
బ్రీచ్‌ (హాలీవుడ్‌) జనవరి 30
ఫ్రైడే నైట్‌ లైట్స్‌ (హాలీవుడ్‌) జనవరి 30

జియో సినిమా

ది స్టోరీ టెల్లర్‌ (హిందీ) జనవరి 28

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+