ఛీ ఛీ అసలు అదేం పేరు.. 300 కోట్లు కొల్లగొట్టిన మూవీపై జయా బచ్చన్ కామెంట్స్ !
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ భార్య.. ఎంపీ జయా బచ్చన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హిందీ సినిమా రంగంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె ఉత్తరాది వారికి బాగా ఫేమస్. ఇక ఈవెంట్ లలో, అవార్డ్స్ ఫంక్షన్స్ లలో, రాజ్యసభలో అప్పుడప్పుడు ఆమెను చూస్తూ ఉండడంతో తెలుగు వారికి కూడా సుపరిచితులు అయ్యారు. ఏదైనా ముక్కుసూటిగా, మొహం మీదే మాట్లాడే జయా బచ్చన్.. తన ఆవేశాన్ని అప్పుడప్పుడు పలు సందర్భాల్లో బయటపెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లకు జయా బచ్చన్ అంటే ఒకింత భయం అని కూడా చెప్పవచ్చు.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఓ స్టార్ హీరో సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఛీ ఛీ అసలు అదేం పేరు.. నిజంగా అది కూడా ఒక పేరేనా.. అది బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయినా.. నా దృష్టిలో మాత్రం ఫ్లాప్ మూవీనే అని జయా బచ్చన్ కామెంట్స్ చేశారు. అయితే అందుకు గల కారణాన్ని సైతం బయటపెట్టారు జయాబచ్చన్. తనకు సినిమాలు చూసే విషయంలో ఒక కండిషన్ ఉంటుందని తెలిపారు.

ఆ నియమం కారణంగానే ఆ చిత్రం చూడలేదని చెప్పారు. సినిమాలు చూసే విషయంలో తాను కొన్ని కండీషన్స్ పెట్టుకున్నానని స్పష్టం చేశారు. టైటిల్ నచ్చకపోతే సినిమా చూడనని తేల్చి చెప్పారు. ఒక్కసారి ఆ టైటిల్ చూడండి.. అలాంటి పేరు ఉన్న సినిమాలు చూడాలని నేను ఎప్పుడూ అనుకోను అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అందుకే అది బ్లాక్ బస్టర్ మూవీ అయినా.. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు కొల్లగొట్టినా కానీ.. ఆ చిత్రం అంటే తనకు నచ్చదని మొహమాటం లేకుండా చెప్పేశారు. తన దృష్టిలో అదొక ఫ్లాప్ చిత్రమని అన్నారు.
ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'టాయిలెట్ - ఏక్ ప్రేమ్‌కథ' చిత్రం. శ్రీ నారాయణ్ సింగ్ దీనికి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భూమి ఫడ్నేకర్ హీరోయిన్ గా నటించింది. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు 300 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని మరుగుదొడ్ల సమస్యను ప్రస్తావిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోరిక మేరకు గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడానికి ఓ భర్త ఏం చేశాడు ? అనేది ఈ సినిమా స్టోరీ. ఇక ఇప్పుడు జయా బచ్చన్ కామెంట్స్ తో ఈ మూవీ గురించి ఆడియన్స్ మళ్లీ తెగ వెతికేస్తున్నారు.
-
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications